Medigadda Case: మేడిగడ్డ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్‌కు మళ్లీ సమన్లు.. సెప్టెంబర్ 9పైనే అందరి చూపు
మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Case) కేసులో కేసీఆర్‌కు మరొకసారి నోటీసులు పంపాల్సిందిగా జిల్లా న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.
- V Santhosh Kumar
- Published on- August 12, 2026 / 04:46 PM IST
Bhupalpally Court orders fresh summons to KCR in the Medigadda barrage case.
- మేడిగడ్డ కేసు సెప్టెంబర్ 9కి.
- కేసీఆర్‌కు మళ్లీ కోర్టు సమన్లు.
- విచారణకు ఎల్‌అండ్‌టీ సంస్థ లాయర్లు.
Medigadda Case: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కేసు(Medigadda Case) విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా కోర్టు ఈ కేసు విచారణను వచ్చే నెల సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అసలు పిటిషనర్ రాయలింగమూర్తి మరణించినప్పటికీ, విచారణ ప్రక్రియను ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ వివాదాన్ని జిల్లా కోర్టు పరిధిలోనే పరిష్కరించుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Cyber Espionage: ఇండియా దురంధర్.. కౌంటర్ గా పాకిస్తాన్ జూలియట్.. వలవేసి రహస్యాలు లాగేస్తున్నారు
కేసీఆర్‌కు అందని సమన్లు:
ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమన్లు ఇంకా అందకపోవడంతో, ఆయనకు మరొకసారి నోటీసులు పంపాల్సిందిగా జిల్లా న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. నేడు ఈ కేసులో తుది నిర్ణయం లేదా తీర్పు వెలువడే అవకాశం ఉందనే వార్తలతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఎల్‌అండ్‌టీ (L&T) సంస్థ ప్రతినిధులు, అలాగే మాజీ మంత్రి హరీశ్‌రావు తరఫు న్యాయవాదులు ప్రత్యేకంగా జిల్లా కోర్టుకు హాజరయ్యారు.
సెప్టెంబర్ 9పైనే అందరి చూపు:
ఉదయం నుంచీ ఉత్కంఠభరితంగా సాగిన న్యాయస్థాన ప్రక్రియ అనంతరం విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. కేసీఆర్‌కు సమన్లు అందడం, తదుపరి విచారణలో వెలువడే నిర్ణయాలపైనే ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
