Telangana SSC Results : రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..

రాష్ట్రవ్యాప్తంగా 2వేల 650 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించగా.. 5 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.

SSC Results : తెలంగాణలో టెన్త్ ఫలితాల విడుదలపై ఉత్కంఠ వీడింది. ఫలితాల విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. రేపు (ఏప్రిల్ 30) పదో తరగతి రిజల్ట్స్ విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం 1గంటకు రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.  ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. రిజల్ట్స్ విడుదలకు ఎస్ఎస్ సీ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

మార్చి 21వ తేదీ నుంచి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వ‌ర‌కు పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 2వేల 650 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించగా.. 5 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. రిజల్ట్స్ కోసం విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఏపీలో టెన్త్ రిజల్ట్స్ వచ్చేశాయి.

Also Read: పాకిస్థాన్ ఆర్మీలో భయమా? తిరుగుబాటా?.. సంచలనం సృష్టిస్తున్న లేఖలు.. వైరల్

ఏప్రిల్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 శిబిరాల్లో స్పాట్ వాల్యుయేషన్ జరిగింది. ఈసారి సబ్జెక్టుల వారీగా ఇంటర్నల్ మార్కులు, ఎక్స్‌టర్నల్ మార్కులు, మొత్తం మార్కులతో SSC పాస్ సర్టిఫికెట్ జారీ చేయడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. మెమోల్లో సబ్జెక్ట్ ల వారీగా మార్క్స్, గ్రేడ్, ఫలితం ఉంటాయి. SSC మెమోలో చివరగా పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే ఫెయిల్ అని మాత్రమే ఉంటుంది. రిజల్ట్స్ లో టోటల్ మార్క్స్, గ్రేడ్ ఉండదని అధికారులు అంటున్నారు.

ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి..
https://results.bsetelangana.org
https://results.bse.telangana.gov.in
https://bse.telangana.gov.in