Kadari Anajaiah Yadav To Join Trs
Kadari Anajaiah Yadav to join TRS : బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. నాగార్జున సాగర్ బీజేపీ కీలక నేత కడారి అంజయ్య యాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో కడారి అంజయ్య గులాబీ కండువాను కప్పుకున్నారు. సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ టికెట్ ఆశించిన అంజయ్య యాదవ్‌కు ఆ పార్టీ అధిష్ఠానం మొండి చెయ్యి చూపించింది. దాంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న అంజయ్య కారు ఎక్కేశారు.
బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్న టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్న ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలతో కలిసి ఆయన టీఆర్ఎస్‌లో చేరారు.
అంజయ్య చేరికతో సాగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ మరింత పటిష్టంగా తయారైంది. కడారి అంజయ్య యాదవ్‌కు.. సీఎం కేసీఆర్ కీలక పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం.