Ration Card Holders: రేషన్ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ తప్పు చేస్తే కార్డు వెంటనే క్యాన్సిల్..

రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది.

New Ration Cards

Ration Card Holders: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్. మీరు కానీ ఈ తప్పు చేస్తే.. ఆ వెంటనే మీ కార్డు క్యాన్సిల్ అవుతుందని వార్నింగ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మ్యాటర్ ఏంటంటే.. రేషన్ కార్డుదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఈ బియ్యాన్ని కొందరు అమ్ముకుంటున్న వైనం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే సన్న బియ్యాన్ని అమ్ముకుంటే చర్యలు తప్పవని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరించారు. ఇలా అమ్ముకున్న వారి రేషన్‌ కార్డులు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చిన అధికారులు ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నారు.

Also Read: IRCTC కొత్త రూల్.. ఇకపై ఈ కోచ్‌లలో వెయిట్‌లిస్ట్ ప్రయాణికులు ప్రయాణించలేరు.. ఎందుకంటే? ఫుల్ డిటెయిల్స్..!

మంచిర్యాల జిల్లాలో రేషన్ బియ్యం అక్రమంగా విక్రయిస్తున్న వారిపై అధికారులు యాక్షన్ తీసుకున్నారు. తాండూరు మండలంలోని అచలాపూర్‌ గ్రామంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించి, ఉచితంగా పొందిన సన్నబియ్యాన్ని అమ్ముకుంటున్న 11 మంది రేషన్ కార్డుదారులను గుర్తించారు. వారి కార్డులను వెంటనే రద్దు చేశారు. వీరు కిలో 16 రూపాయల చొప్పున 1.91 క్వింటాళ్ల బియ్యాన్ని అమ్ముకున్నారని అధికారులు తెలిపారు. రేషన్‌ బియ్యం అమ్మినవారితో పాటు కొన్నవారి పైనా కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.

రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అయితే, కొందరు లబ్ధిదారులు రేషన్ దుకాణాల నుంచి ఉచితంగా బియ్యం తీసుకుని వాటిని అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారం అధికారులకు అందింది. దీంతో అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. బియ్యం అమ్ముకున్న వారిని గుర్తించి వారి రేషన్ కార్డులు రద్దు చేశారు.