IRCTC Rule : IRCTC కొత్త రూల్.. ఇకపై ఈ కోచ్‌లలో వెయిట్‌లిస్ట్ ప్రయాణికులు ప్రయాణించలేరు.. ఎందుకంటే? ఫుల్ డిటెయిల్స్..!
IRCTC Rule : వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణీకులు ఈ కోచ్‌లలో ప్రయాణిస్తే.. జరిమానా చెల్లించాల్సి రావొచ్చు.

IRCTC Rule
IRCTC Rule : ఐఆర్‌సీటీసీ కొత్త రూల్ వచ్చేసింది. ఇకపై వెయిట్ లిస్టు రైల్వే ప్రయాణికులు ఈ కోచ్‌లలో ప్రయాణించలేరు. వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులు స్లీపర్ లేదా ఏసీ కోచ్‌లలో ప్రయాణించడం నిషేధం.
Read Also : EPFO Password : మీ EPFO పాస్‌వర్డ్ మర్చిపోయారా? ఎలా రీసెట్ చేయాలంటే? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!
జనరల్ క్లాసులో మాత్రమే ప్రయాణించేందుకు అనుమతిస్తారు. మే 1 నుంచి కన్ఫార్డ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేలా భారతీయ రైల్వే కఠినమైన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.
సాధారణంగా, IRCTC ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే.. అది ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. అయితే, కౌంటర్ నుంచి వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు కొనుగోలు చేసే చాలా మంది ప్రయాణీకులు ఇప్పటికీ స్లీపర్, ఏసీ కోచ్‌లలో ప్రయాణిస్తుంటారు.
కొత్త నిబంధనలో భాగంగా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులు స్లీపర్, ఏసీ కోచ్‌లలో ప్రయాణించకుండా నిషేధం అమల్లోకి వచ్చింది.
ఈ కోచ్‌లలో వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణీకుడు సీటుపై కూర్చుని ప్రయాణిస్తే.. జరిమానా విధించడం లేదా జనరల్ కంపార్ట్‌మెంట్‌కు పంపే హక్కు TTEకి ఉంటుందని గమనించాలి.
కన్ఫార్డ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులకు సౌకర్యార్థం ఈ కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చినట్టు నార్త్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ శశి కిరణ్ తెలిపారు.
తద్వారా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్నవారి కారణంగా ప్రయాణ సమయంలో అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.
వెయిటింగ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులు స్లీపర్, ఏసీ కోచ్‌లలో కన్ఫర్మ్ టిక్కెట్లు ఉన్నవారి సీట్లలో కూర్చొవడం అందరికీ అసౌకర్యం కలుగుతుంది.
ఈ ట్రైన్ కోచ్‌లలో వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ ప్రయాణీకుల సంఖ్య పెరిగితే ఇతర ప్రయాణికులకు మరింత ఇబ్బందిగా మారుతుంది.
మీరు వెయిటింగ్ టిక్కెట్లతో ప్రయాణిస్తుంటే.. ఇకపై ముందుగా టికెట్ కన్ఫార్మ్ అయ్యాక ప్రయాణించడం ఎంతైనా మంచిది. లేదంటే జరిమానా చెల్లించాల్సి రావొచ్చు.