Motorola Edge 60s : పిచ్చెక్కించే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60s వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Motorola Edge 60s : కొత్త మోటోరోలా ఫోన్ వచ్చేస్తోంది. మే 8న మోటోరోలా ఎడ్జ్ 60s ఫోన్ ఐపీ68 రేటింగ్, 50ఎంపీ కెమెరాతో లాంచ్ కానుంది.

Motorola Edge 60s
Motorola Edge 60s Launch : మోటోరోలా అభిమానులకు గుడ్ న్యూస్.. మోటోరోలా నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. అతి త్వరలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది.
మే 8న కంపెనీ జరగబోయే ఈవెంట్‌లో కొత్త మోడల్‌ను ఆవిష్కరించబోతోంది. మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్‌కు సంబంధించి డిజైన్, వాటర్ రెసిస్టెన్సీ వంటి ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లతో రానుంది.
మోటోరోలా ఎడ్జ్ 60s లాంచ్ తేదీ :
మోటోరోలా ఇప్పుడు అధికారికంగా ఎడ్జ్ 60s మే 8 న చైనాలో లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది. మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్‌లోని మరో రెండు వేరియంట్లుఎడ్జ్ 60, ఎడ్జ్ 60 ప్రో కూడా లాంచ్ కానున్నాయి.
ఫోల్డబుల్ లైనప్‌లోని RAZR 60, RAZR 60 అల్ట్రా కూడా ఇందులో ఉండనున్నాయి. మోటోరోలా ఎడ్జ్ 60s కొత్త ఫోన్‌గా మార్కెట్‌లో ఉన్నప్పటికీ ప్రపంచ మార్కెట్లలో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చునని పుకార్లు ఉన్నాయి.
డిస్‌ప్లే, డిజైన్ :
మోటోరోలా ఎడ్జ్ 60s 6.7-అంగుళాల కర్వ్డ్-ఎడ్జ్ P-OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటోరోలా ఫోన్ 8.2mm మందం, 190 గ్రాముల బరువుతో సన్నని బాడీని కలిగి ఉంటుంది. IP68/69 రేటింగ్‌తో ఉంది. దుమ్ము, నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. మోటోరోలా ఎడ్జ్ 60s ఫోన్ మింట్, రోజ్, పర్పల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండవచ్చు.
పర్ఫార్మెన్స్, బ్యాటరీ :
మోటోరోలా ఎడ్జ్ 60s, మీడియాటెక్ డైమన్షిటీ 7400 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. రోజువారీ ఉపయోగం, గేమింగ్ కోసం బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 68W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5500mAh బ్యాటరీతో వస్తుంది.
కెమెరా ఫీచర్లు :
కెమెరా విషయానికి వస్తే.. ఈ మోటోరోలా ఫోన్ 50MP సోనీ LYT-700C ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఆకర్షణీయమైన ఫొటోల కోసం OISకి సపోర్టు ఇస్తుంది. మాక్రో షాట్‌ల కోసం 13MP అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎడ్జ్ 60s, 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కంటెంట్ క్రియేటర్లు, సాధారణ యూజర్ల కోసం కెమెరా సెటప్‌ను అందించనుంది.
Read Also : Audi Cars SUV : కొత్త కారు కొంటున్నారా? భారీగా పెరగనున్న ఆడి కార్లు, SUV కార్ల ధరలు.. ఎప్పటినుంచంటే?
మోటోరోలా రీబ్రాండ్ ఫోన్ (అంచనా) :
మోటోరోలా ఎడ్జ్ 60s బ్రాండింగ్ కొత్తదే అయినప్పటికీ, చాలా మంది చైనాలో XT2503-3 మోడల్‌గా భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ రీబ్యాడ్జ్డ్ వెర్షన్‌గా విడుదలైంది. మోటోరోలా ప్రాంతాలను బట్టి మార్కెట్ ఆఫర్‌లను రీబ్రాండ్ చేస్తోందని నివేదిక సూచిస్తుంది.