BIO Convention : ఫిబ్ర‌వ‌రి 24, 25న బయో ఆసియా స‌ద‌స్సు.. ఈసారి వర్చువల్ ఫార్మాట్‌లో..!

బ‌యో ఆసియా స‌ద‌స్సుకు హైద‌రాబాద్ మహానగరం మరోసారి వేదికగా మారనుంది. 2022 ఏడాదిలో కూడా హైద‌రాబాద్ న‌గ‌రంలోనే అంతర్జాతీయ బయో ఆసియా సదస్సు జరుగనుంది.

BIO Convention : బ‌యో ఆసియా స‌ద‌స్సుకు హైద‌రాబాద్ మహానగరం మరోసారి వేదికగా మారనుంది. 2022 ఏడాదిలో కూడా హైద‌రాబాద్ న‌గ‌రంలోనే అంతర్జాతీయ బయో ఆసియా సదస్సు జరుగనుంది. కొవిడ్ దృష్ట్యా ఈ బయో ఆసియా సదస్సును ఈసారి వర్చువల్ ఫార్మాట్‌లో రెండు రోజులు పాటు నిర్వహించనున్నారు.

ఈ స‌ద‌స్సును ఫ్యూచ‌ర్ రెడీ థీమ్‌తో నిర్వ‌హించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వచ్చే ఫిబ్ర‌వ‌రి 24, 25 తేదీల్లో నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స‌ద‌స్సుకు 70కి పైగా దేశాల నుంచి 30 వేల మంది ప్ర‌తినిధులు హాజ‌రు కానున్నారు. బ‌యో ఆసియా స‌ద‌స్సు రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో నిర్వహించనున్నారు. బ‌యోటెక్నాల‌జీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఫ్లాగ్‌షిప్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. 2021 ఏడాదిలో కూడా హైద‌రాబాద్ వేదిక‌గా బ‌యో ఆసియా స‌ద‌స్సు జరిగిన సంగతి తెలిసందే.

అప్పుడు ‘మూవ్‌ ద నీడిల్‌’ థీమ్‌తో ఈ బయో ఆసియా స‌ద‌స్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 30 వేల మంది వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు, నిపుణులు హాజ‌ర‌య్యారు. 2020 ఏడాదిలోనూ బ‌యో ఆసియా స‌ద‌స్సుకు హైద‌రాబాద్ వేదికగా జరిగింది. తెలంగాణ నుంచి సదస్సులో మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ అధికారులు జయేష్ రంజన్ పాల్గొననున్నారు.

వివిధ దేశాల ప్రతినిధులు సదస్సులో పాల్గొననున్నారు. ఫార్మా, బయోటెక్ కంపెనిలు, పెట్టుబడిదారులు,విద్యాసంస్థల అధిపతులతో పాటు పలువురు శాస్త్రవేత్తలు, ప్రముఖ వక్తలు, తదితరులు పాల్గొనున్నారు. ఈ సదస్సులో భవిష్యత్ లో వచ్చే మహమ్మారిని ఎదుర్కొవడంపై ప్రధానంగా చర్చించనున్నారు.

Read Also : AP Corona Cases : ఏపీలో కరోనా ఉగ్రరూపం.. మరోసారి 14వేలకు పైగా కేసులు, ఏడు మరణాలు

ట్రెండింగ్ వార్తలు