AP Corona Cases : ఏపీలో కరోనా ఉగ్రరూపం.. మరోసారి 14వేలకు పైగా కేసులు, ఏడు మరణాలు

ఏపీలో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి కొత్త కేసులు భారీగా సంఖ్యలో వెలుగుచూశాయి.

AP Corona Cases : ఏపీలో కరోనా ఉగ్రరూపం.. మరోసారి 14వేలకు పైగా కేసులు, ఏడు మరణాలు

Ap Corona Cases

Updated On : January 24, 2022 / 5:27 PM IST

AP Corona Cases : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి కొత్త కేసులు భారీగా సంఖ్యలో వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 14వేల 502 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో ఏడుగురు కోవిడ్ తో చనిపోయారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు చనిపోయారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. మరోవైపు 4వేల 800 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

Watching TV : అధిక సమయం టీవీ చూసే అలవాటుందా?… అయితే జాగ్రత్త?

ప్రస్తుతం రాష్ట్రంలో 93వేల 305 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన వాటిలో విశాఖలో అత్యధికంగా 1728 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 1610 కేసులు వెలుగుచూశాయి. కాగా, రాష్ట్రంలో నిన్న 14వేల 440 కేసులు నమోదవగా.. ఇవాళ ఆ సంఖ్య మరింత పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.

Yoga : యోగాకు ముందు…తరువాత… పాటించాల్సిన ఆహార నియమాలు

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,95,136 కి చేరింది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,87,282గా ఉంది. గడిచిన 24 గంటల్లో 40వేల 266 కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,21,87,297 కోవిడ్ టెస్టులు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.