Yoga : యోగాకు ముందు…తరువాత… పాటించాల్సిన ఆహారనియమాలు

యోగా తర్వాత మన శరీరానికి అధిక కేలరీలు అవసరం అవుతాయి. ఈ క్రమంలోనే అధిక కేలరీలు కలిగిన పన్నీర్ తీసుకోవడం ఉత్తమం.

Yoga : యోగాకు ముందు…తరువాత… పాటించాల్సిన ఆహారనియమాలు

Yoga Food

Yoga : యోగా వల్ల ఎన్నో లాభాలున్నాయి. శారీరకంగా, మానసికంగా ధృఢంగా తయారవ్వవచ్చు. దీన్ని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనసు, శరీరం రెండూ ఎంతో ప్రశాంతగా, ఆరోగ్యంగా ఉంటాయి. యోగా చేయటం వల్ల మనలో ఉన్నటువంటి ఆందోళన ఒత్తిడి తొలగిపోతాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం యోగ మాత్రమే కాకుండా యోగ చేయటానికి ముందు యోగా చేసిన తర్వాత కూడా తప్పనిసరిగా సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. యోగ తర్వాత కొన్ని ఆహారపదార్ధాలను తీసుకున్నప్పుడు శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.

యోగా చేస్తున్న సమయంలో మన శరీరం అధిక మొత్తంలో క్యాలరీలను కోల్పోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మనం తగినన్ని కార్బోహైడ్రేట్లను ఆహార రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. కనుక ఆరోగ్యకరమైన శాఖాహార లేదా మాంసాహారంతో తయారు చేసిన సూప్ తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసినన్ని కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. అదేవిధంగా సూప్ తో పాటు సలాడ్ తీసుకోవచ్చు. వివిధ రకాల పండ్లు, గింజలను ఉపయోగించి సలాడ్ తయారు చేసుకునీ తాగవచ్చు.

యోగా తర్వాత మన శరీరానికి అధిక కేలరీలు అవసరం అవుతాయి. ఈ క్రమంలోనే అధిక కేలరీలు కలిగిన పన్నీర్ తీసుకోవడం ఉత్తమం. ఒక వ్యక్తి నీరసించి పోయినప్పుడు వెంటనే శక్తి పొందడానికి కొబ్బరి నీళ్లు తాగించడం పూర్వకాలం నుంచి వస్తుంది. కొబ్బరి నీళ్లలో అధిక మొత్తంలో పోషకాలు ఉండటం వల్ల తొందరగా మన శరీరానికి శక్తి అందుతుంది. యోగా చేసిన తర్వాత ముఖ్యంగా చక్కర,కొవ్వుతో నిండిన మాంసాహారాలకు దూరంగా ఉండటం మంచిది.

యోగా చేసే ముందు ఆహారం విషయంలో జాగ్రత్త చాలా అవసరం. మామూలుగా ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత యోగా చేయాలి. అంతే కానీ, ఆహారం తీసుకున్న వెంటనే యోగా చూయకూడదు ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. అదే విధంగా తీసుకునే ఆహార పరిమాణం విషయంలోనూ ఖచ్చితమైన అవగాహన ఉండాలి. కడుపునిండుగా భోజనం చేసి యోగా చేయడం సరికాదు. భోజనానికి, యోగా చేసేందుకు మధ్య సమయం ఉండేలా చూసుకోండి.  ఆకలి అనుకుంటే యోగా చేసే ఓ అరగంట ముందు చిన్న పండు తీసుకోవచ్చు. దీనితో పాటు నీరు తాగే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి.