bio metric attendance
Bio Metric Attendance : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందుకు సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించింది. అయితే స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేసేందుకు, వారి హాజరు శాతాన్ని తెలుసుకునేందుకు బయోమెట్రిక్ హాజరు ఉపయోగపడుతుందన్నారు.
ఇక టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఆయా విద్యా సంస్థల్లో ఎంత సమయం పని చేస్తున్నారు. వారి సెలవులు, ఇతరత్రా విషయాలకు కూడా బయో మెట్రిక్ హాజరు ఉపయోగపడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.