Police Holidays: పోలీసులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఆ ప్రత్యేక రోజుల్లో సెలవులు మంజూరు
Telangana Police Holidays: విధుల్లో పోలీసులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కుటుంబంతో సమయం గడిపేందుకు అవకాశం కల్పించామన్నారు.
- Naveen
- Updated on- April 28, 2026 / 12:26 PM IST
Telangana State Police Holidays
Telangana Police Holidays: తెలంగాణ పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి శుభవార్త చెప్పారు. ప్రతి పోలీస్ ఉద్యోగికి ప్రత్యేక సెలవులు ప్రకటించారు. పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం వంటి రోజుల్లో సెలవు మంజూరు చేశారు. పోలీస్ డ్యూటీ అంటేనే చాలా టఫ్. శాంతి భద్రతల్లో రాత్రింబవళ్లు నిమగ్నమై ఉండాలి.
నిత్యం విధుల్లో ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ క్రమంలో పోలీసుల సంక్షేమం దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు. విధుల్లో పోలీసులపై ఒత్తిడి తగ్గించేందుకు, కుటుంబంతో సమయం గడిపేందుకు ఈ అవకాశం కల్పించామన్నారు.
పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున కుటుంబసభ్యులతో గడపాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అయితే, పోలీసులకు అలాంటి పరిస్థితి ఉండదు. కఠినమైన విధులు నిర్వహించాల్సి ఉంటుంది. లా అండ్ ఆర్డర్, సమాజ రక్షణ కోసం తమ వ్యక్తిగత జీవితాన్ని, సంతోషాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి. చివరికి పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకలకు కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారికి రిలీఫ్ ఇచ్చేలా సెలవు మంజూరు చేశారు డీజీపీ. ప్రతి పోలీస్ తమ పుట్టిన రోజున, పెళ్లి రోజున సెలవు తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
కానిస్టేబుల్ స్థాయి నుండి ఉన్నతాధికారుల వరకు అందరికీ ఈ వెసులుబాటు వర్తిస్తుంది. అయితే ఈ సెలవులు పొందాలంటే ఒక షరతు ఉంది. సెలవు కావాలంటే తప్పనిసరిగా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలి. అందుకు తగిన ఆధారాలు చూపాలి. సర్వీస్ రిజిష్టర్ ఆధారంగా తమ పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో ముందుగానే రాత పూర్వకంగా అభ్యర్థన సమర్పించాలి. ఇక అత్యవసర పరిస్థితులు మినహా సాధారణ సమయాల్లో సెలవులు మంజూరు మంజూరు చేయాలి. ఈ మేరకు యూనిట్ అధికారులకు డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేక రోజుల్లో సెలవులు మంజూరు చేస్తూ డీజీపీ తీసుకున్న నిర్ణయంపై పోలీస్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: రూ.15 వేల లోపు చెల్లింపులకై RBI కొత్త రూల్స్.. OTPపై కీలక అప్డేట్
