Biryani: బిర్యానీ లవర్స్‌కు బిగ్ షాక్.. ఆన్లైన్లో బిర్యానీ తెప్పించుకుంటున్నారా? ఒక్కసారి ఇది చూడండి..
విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.
- ఫ్రిడ్జిలో నిల్వ ఉంచిన బిర్యానీ
- ఆన్ లైన్ లో కస్టమర్లకు అమ్మకాలు
- ఓవెన్ లో వేడి చేసి జొమాటో, స్విగ్గీలో విక్రయాలు
- కాసుల కక్కుర్తితో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం
Biryani: హైదరాబాద్ లో అక్రమ, కల్తీ దందాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతీ ఆహార పదార్ధాలను కల్తీ చేసి విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా బిర్యానీ ప్రియులకు ఝలక్ తగిలింది. నాలుగు రోజులుగా ఫ్రిడ్జిలో ఉంచిన బిర్యానీని ఆన్ లైన్ ద్వారా విక్రయాలు జరుపుతున్నాడు. లక్కీ బిర్యానీ అండ్ షోర్మా పేరుతో బంజారాహిల్స్ లో ఓ అపార్ట్ మెంట్ లో బిర్యానీ విక్రయిస్తున్నాడు. ఫ్రిడ్జిలో ఉంచిన బిర్యానీని ఓవెన్ లో వేడి చేసి జొమాటో, స్విగ్గీ ద్వారా విక్రయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.
బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం. లొట్టలేసుకుంటూ తింటారు. ఏదైనా పార్టీ జరిగిందంటే బిర్యానీ ఉండాల్సిందే. అయితే, కొందరు కేటుగాళ్లు కాసుల కక్కుర్తితో దిగజారిపోతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ చేసిన, పాడైపోయిన ఆహార పదార్ధాలను జనాలకు అంటగడుతున్నారు. తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ లో దారుణం వెలుగుచూసింది. ఓ వ్యక్తి పెద్ద సంఖ్యలో బిర్యానీ పొట్లాలు ఫ్రిడ్జిలో ఉంచి మరీ జనాలకు అమ్ముతున్నాడు.
బిర్యానీని ప్యాకెట్లలో నింపిన అతడు.. ఆ ప్యాకెట్లను ఓ ఫ్రిడ్జిలో నిల్వ చేశాడు. ఆన్ లైన్ లో కస్టమర్ నుంచి ఆర్డర్ రాగానే బిర్యానీ బయటకు తీసి ఓవెన్ లో హీట్ చేసి అమ్మేస్తున్నాడు. ఈ వ్యవహారం బయటపడటంతో బిర్యానీ లవర్లు షాక్ అవుతున్నారు. ఇన్నాళ్లు తాము తిన్న బిర్యానీ మంచిదో కాదో అని ఆందోళన చెందుతున్నారు. తమకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయోనని వర్రీ అవుతున్నారు.
రోజుల తరబడి నిల్వ చేసిన బిర్యానీని అస్సలు తినకూడదని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి బిర్యానీ తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటున్నారు. రోగాల బారిన పడటం ఖాయం అంటున్నారు. కాసుల కక్కుర్తితో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడే ఇలాంటి కేటుగాళ్లను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: తెలంగాణ మహిళలకు పండగలాంటి వార్త.. తులం బంగారం పథకంపై బిగ్ అప్డేట్.. ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే
