Eatala Rajender : కేసీఆర్ పైసల్ని, దుర్మార్గాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు.. నాదిప్పుడు చావో రేవో పరిస్థితి : ఈటల రాజేందర్

నేను చిన్నవాడిని, కేసీఆర్ కున్న పైసలు నాకు లేవు..కేసీఆర్ దుర్మార్గాన్ని తట్టుకునే శక్తీ నాకు లేదు..కానీ నా దగ్గర ధర్మం అనే అస్త్రం మాత్రమే ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈటన రాజేందర్.

Eatala Rajender on CM KCR : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. సభలు, సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మరోపక్క ఆయా పార్టీ నుంచి వచ్చే నేతలను తమ పార్టీల్లో చేర్చుకుంటున్నారు. దీంట్లో భాగంగా బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మేడ్చల్ లోని శామీర్ పేటలో బీజేపీలో చేరేందుకు వచ్చిన నేతలకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘నేను చిన్నవాడిని, కేసీఆర్ కున్న పైసలు నాకు లేవు. కేసీఆర్ దుర్మార్గాన్ని తట్టుకునే శక్తీ నాకు లేదు. కానీ నా దగ్గర ధర్మం అనే అస్త్రం మాత్రమే ఉంది’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఈటల ప్రజలకు బీజేపీని గెలిపించాలని పిలుపునిస్తూ.. కేసీఆర్ దుర్మార్గాన్ని అణిచివేసే శక్తి గజ్వేల్ ప్రజలకు మాత్రమే ఉందన్నారు. ‘‘నేను గెలిస్తే మీరు గెలిచినట్టు. నాకు ఇప్పుడు చావో, రేవో రెండే మిగిలాయి. అవసరమైతే అన్ని అమ్ముకుంటాం కానీ కొట్లాట మాత్రం ఆపమని నా భార్య చెప్పింది. మనిషి వెయ్యేళ్ళు బ్రతకడానికి రాలేదు. కానీ చనిపోయిన రోజు ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు అనేది ముఖ్యమని’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: తెలంగాణాకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష : గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ ఉద్యమం, హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదం తాను ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేలా చేసిందన్నారు ఈటల. ఇలా ఉద్యమంలోనూ, రాజకీయాల్లోను ఎన్నో ఎత్తు పల్లాలు చూసి ఈ స్థాయికి వచ్చిన తన జీవితం ధన్యమైంది అంటూ భావోద్వేగానికి గురయ్యారు. తాను గజ్వేల్ ప్రజల నుంచి కూడా ఆ ఆశీర్వాదం కోరుకుంటున్నానని.. కేసీఆర్ మన హక్కుకి, ఆత్మగౌరానికి వెలగట్టే ప్రయత్నం చేస్తారు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు