Gutta Sukhender Reddy : తెలంగాణాకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష : గుత్తా సుఖేందర్ రెడ్డి

పార్టీ ఆదేశిస్తే తాను గానీ, నా కుమారుడు అమిత్ గానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. పార్టీ తన పిల్లలను తానే తిన్నట్టుగా.. మా నాయకులు మా నాయకులనే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Gutta Sukhender Reddy : తెలంగాణాకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష : గుత్తా సుఖేందర్ రెడ్డి

Gutha Sukender Reddy

Legislative Council Chairman Gutta Sukhender Reddy : తెలంగాణాకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష..కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయటానికి అందరు కలిసి కట్టుగా పనిచేయాలని కోరుతున్నాను అంటూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాడర్ కు పిలుపునిచ్చారు. నల్లగొండలో మీడియా సమావేశంలో గుత్తా మాట్లాడుతు..తాను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి విశ్వాసంగా పని చేస్తానని అన్నారు. 2009లో టీడీపీలో టికెట్ ఇవ్వకపోగా.. తనను చాలా ఇబ్బందుకు గురి చేశారు అంటూ ఆనాటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు తన సొంత సోదరుడు బీఆర్ఎస్ లో చేరడం తో కొంత ఇబ్బందికి గురయ్యానన్నారు. ఇప్పుడు కూడా స్థానిక నేతలతో పడక తన అనుచరులు పార్టీ వీడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తన అనుచరులు పార్టీ మారితే తనపై అభాండాలు వేయటం సరికాదన్నారు. అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా..తాత్కాలిక సమస్యలు ఏమున్నా సర్దుబాటు చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయనకు మరోసారి మద్దతుగా ఉండి సీఎంను చేయాలని కోరారు.

పార్టీ ఆదేశిస్తే తాను గానీ, తన కుమారుడు అమిత్ గానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని..ఏది ఏమైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. పార్టీ తన పిల్లలను తానే తిన్నట్టుగా.. మా నాయకులు మా నాయకులనే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ఏపార్టీ ఏం చెప్పినా.. ఎన్ని హామీలు ఇచ్చినా మరోసారి కేసీఆర్ విజయం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గుత్తా మేటి గడ్డ పిల్లర్ విషయంపై మాట్లాడుతు..2009 లో భారీ వరదలకు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల వేలాది మంది నిరాశ్రయులయ్యారని..దానికి ఆనాటి ప్రభుత్వ పెద్దలే కారణమని ఆరోపించారు.శ్రీశైలం గేట్లు ఎత్తి మళ్ళీ కొంత మంది పెద్దల ఒత్తిడితో మూసివేశారని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వంటి ఘటనలో సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయాలని.. దీంట్లో ఎటువంటి రాజకీయాలకు ఆస్కారం లేదన్నారు గుత్తా సుఖేందర్.