Chikoti Praveen : చీకోటి ప్రవీణ్‌కు బీజేపీ ఊహించని షాక్.. పార్టీలో చేరుదామని వెళితే

చీకోటి ప్రవీణ్ చేరిక విషయం తెలిసి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకోటి ప్రవీణ్ చేరికను వెంటనే.. Chikoti Praveen

Chikoti Praveen - BJP

Chikoti Praveen – BJP : క్యాసినో డాన్ గా గుర్తింపు పొందిన చీకోటి ప్రవీణ్ కు ఊహించని షాక్ ఇచ్చింది బీజేపీ. బీజేపీలో చేరాలని చీకోటి ప్రవీణ్  అనుకున్నారు. అయితే, చీకోటి ప్రవీణ్ ను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నిరాకరించింది.

పార్టీలో చేరేందుకు చీకోటి ప్రవీణ్ హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసుకి వెళ్లారు. అదే సమయంలో బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇంఛార్జి ప్రకాశ్ జవదేకర్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. చీకోటి ప్రవీణ్ చేరిక విషయం తెలిసి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకోటి ప్రవీణ్ చేరికను వెంటనే ఆపాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. దీంతో బీజేపీలో చీకోటి ప్రవీణ్ చేరికకు బ్రేక్ పడింది.

మొత్తంగా చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరిక వాయిదా పడింది. కాగా, మాజీమంత్రి కృష్ణయాదవ్ తరహాలోనే చీకోటి ప్రవీణ్ చేరిక వ్యవహారం మారింది. పార్టీలో చేరేందుకు చీకోటి ప్రవీణ్ భారీ ర్యాలీగా నాంపల్లి బీజేపీ కార్యాలయనికి వెళ్లారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకోవాల్సింది. ఇంతలో సడెన్ గా చీకోటి ప్రవీణ్ చేరిక ఆగిపోయింది. పార్టీలో చేరేందుకు బీజేపీ కార్యాలయానికి చీకోటి ప్రవీణ్ వెళితే ఆ పార్టీ నేతలు అంగీకరించలేదు. పార్టీలో చేరిక ఆగడంతో రాష్ట్ర కార్యాలయంలో ప్రవీణ్ తో చర్చలు జరుపుతున్న బీజేపీ నేతలు.

బీజేపీలో తన చేరిక ఆగిపోవడంపై చీకోటి ప్రవీణ్ స్పందించారు. తన చేరిక విషయంలో ఇంకా ఎవరి నుంచో క్లారిటీ రావాల్సింది ఉందన్నారాయన. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయం ఇచ్చారు చీకోటి ప్రవీణ్. ఎన్నో ఆటుపోట్లను చూశాను, ఇంతకంటే పెద్ద సవాళ్లు ఎదుర్కొన్నా అని వ్యాఖ్యానించారు.

Also Read..BRS Party: బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారిన ఆ మూడు స్థానాలు!

”ఇదేం పెద్ద సమస్య కాదు. ఇవాళ రాత్రి 8 గంటల వరకు చేరికపై క్లారిటీ ఇస్తామన్నారు. అభిమానులు కాస్త ఓపికగా ఉండాలి. తెలంగాణతో సంబంధం లేకుండా విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇతర ప్రాంతాల నుంచి నా అభిమానులు వచ్చారు. ఇంకా వస్తున్నారు.

గంట రెండు గంటలు ఆలస్యం అయినంత మాత్రాన కొంపలు అంటుకుపోవు. మిస్ కమ్యూనికేషన్ ఉంటే ఒక మనిషితో ఉండొచ్చు. బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. పార్టీ పెద్దలతో భేటీ తర్వాత నా కార్యాచరణ ప్రకటిస్తా. చీకోటి వెరీ స్ట్రాంగ్. మీ అందరి బలం, ఆశీర్వాదం, అభిమానం నాకుంది.
రాజకీయాల్లో ఆవేశం పనికి రాదు. ఓపికగా ఉందాం” అని చీకోటి ప్రవీణ్ అన్నారు.

Also Read..KTR: తెలంగాణ ఎన్నికలపై కేటీఆర్ సంచలన కామెంట్స్

కాగా, చీకోటి ప్రవీణ్ చేరికపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చీకోటి ప్రవీణ్ చేరిక ఆపడంపై బండి సంజయ్ అసంతృప్తిగా ఉన్నారట. పార్టీ కార్యాలయానికి పిలిచి చేర్చుకోకపోవడం సరైనది కాదన్నారని తెలుస్తోంది. చీకోటి ప్రవీణ్ కట్టర్ హిందువు అని, ఆయన చేరితే పార్టీకి బలం అని బండి సంజయ్ అభిప్రాయపడినట్లు సమాచారం.