Etela Rajender : హుజూరాబాద్ లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావట్లేదు.. కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోంది

సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హుజూరాబాద్ లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని.. కేసీఆర్ రాజ్యాంగం మాత్రమే అమలు అవుతోందని అన్నారు.

Etela Rajender

Etela Rajender criticized CM KCR : సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హుజూరాబాద్ లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని.. కేసీఆర్ రాజ్యాంగం మాత్రమే అమలు అవుతోందని అన్నారు. 5 నెలలుగా హుజురాబాద్ లో మద్యం ఏరులై పారుతోందని.. కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. శనివారం (అక్టోబర్2, 2021)న హుస్నాబాద్ లో నిర్వహించిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ తొలిదశ ముగింపు సభలో ఆయన ప్రసంగించారు.

హుజూరాబాద్ లో కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య పోరాటం జరుగుతోందన్నారు. అక్టోబర్ 30న జరిగే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మమే గెలుస్తుందన్నారు. హుజూరాబాద్ కురుక్షేత్రంలో గెలిచాక… ఆ తర్వాత 33 జిల్లాల కురుక్షేత్రమే అని పేర్కొన్నారు. హుజూరాబాద్ ప్రజానీకం అంతా తనను గెలిపించాలని కోరుకుంటున్నారని తెలిపారు.

Huzurabad By Election : ఈటలకు చావోరేవో..బీజేపీ గెలుస్తుందా ?

హుజూరాబాద్ లో 75% బీజేపీ కి, టీఆర్ ఎస్ కి 25% మాత్రమే గెలుపు అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెప్తుంటే…కేసీఆర్ కి దిమ్మతిరుగుతోందన్నారు. తనను ఓడించేందుకు ప్రగతి భవన్ లో కూర్చుని కేసీఆర్ ఆదేశాలు ఇస్తుంటే… కొంతమంది అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దొంగ లేటర్లు సృష్టించి కుట్రలకు తెర తీశారని… సూర్యుడి మీద ఉమ్మితే అది నీ మొఖం మీదే పడుతుందన్నారు.

ఎన్ని దొంగ లెటర్స్ సృష్టించినా… అది వాళ్ళకే తిప్పి కొడుతుందన్నారు. వందల కోట్లతో మనుషులకు విలువ కడుతున్నారని మండిపడ్డారు. ఇన్నేళ్ల స్వాతంత్ర్య చరిత్రలో మొదటిసారి వేల కోట్లు ఖర్చు చేసి రాజేందర్ ను ఓడించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనలాంటి బక్క పలుచని ఉద్యమకారుడిని కొట్టాలని చూస్తే… అయ్యే పనేనా అని అన్నారు.

Harish Rao : బీజేపీ గాలిని కూడా అమ్ముతుందేమో : హరీష్ రావు

దళితులపై నిజంగా ప్రేమ ఉంటే దళిత బంధు పథకాన్ని 33 జిల్లాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని కులాల్లోని పేదలకు ఈ పథకాన్ని అమలు చేయాలని కోరారు. మూడేళ్లుగా ఇవ్వని పావలా వడ్డీ ఒక్క హుజురాబాద్ కేనా.. తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బీజేపీని గెలిపించేందుకు 33 జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆగస్టు 28న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైందని తెలిపారు. పాదయాత్ర 36 రోజులపాటు కొనసాగి, హుస్నాబాద్ లో విజయవంతంగా ముగిసిందన్నారు. పాదయాత్ర చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.