Jithender Reddy, Raghunandan Rao
AP Jithender Reddy- Telangana BJP Leader: తెలంగాణలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో రాష్ట్ర బీజేపీలో నేతల మధ్య అంతర్గత యుద్ధం కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షుడి మార్పు విషయంలో, పార్టీలో పదవుల విషయంలో నాయకులు వర్గాలుగా విడిపోయి బహిరంగంగానే వాదనలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర పార్టీ అధిష్టానం రాష్ట్రంలోని విబేధాలున్న నేతల మధ్య సయోధ్యకుదిర్చే ప్రయత్నం చేస్తున్నా ఉపయోగం లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
Eatala Rajender : వయసు, అనుభవం ఉన్నవారు ఏది పడితే అది మాట్లాడొద్దు : జితేందర్ రెడ్డికి ఈటల కౌంటర్
జితేందర్ రెడ్డి తన ట్వీట్‌లో దున్నపోతును తన్ని ట్రాలీలో ఎక్కించే వీడియోను పోస్ట్ చేశారు. ‘తెలంగాణ బీజేపీకి ఇలాంటి ట్రీట్మెంట్ కావాలి’ అంటూ రాశారు. జితేందర్ రెడ్డి ట్వీట్‌పై రాష్ట్ర బీజేపీలో ఒక్కసారిగా కలకలం రేపింది. మరో ట్వీట్‌లో కేసీఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే.. బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగా అర్థం చేసుకునే ఊరకుక్కల్లార.. బిస్కెట్లకోసం బరితెగించకండి అంటూ జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పట్ల బీజేపీలోని పలువురు నేతలు జితేందర్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
BJP : త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకం..
తాజాగా జితేందర్ రెడ్డి మరో ట్వీట్ చేశారు. అయితే, ఈసారి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌కు మద్దతుగా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. రఘునందన్ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేసిన జితేందర్ రెడ్డి.. రఘునందన్‌ను జాతీయ అధికార ప్రతినిధి చేయాలనే డిమాండ్‌కు నేను సపోర్ట్ చేస్తా అంటూ పేర్కొన్నారు. ఈ వీడియోలో కేంద్రానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై రఘునందన్ విమర్శలు చేశారు. ముఖ్యంగా మంత్రి హరీష్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మూడు రోజుల క్రితం జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ తెలంగాణ బీజేపీలో పెద్ద దుమారాన్ని లేపగా.. తాజాగా రఘునందన్ రావు మాట్లాడుతున్న వీడియోను షేర్ చేసి, రఘునందన్‌కు మద్దతు పలుకుతున్నానని జితేందర్ రెడ్డి పేర్కొనడం గమనార్హం.
Proud of your voice. I support you as national spokesperson @blsanthosh @AmitShah @JPNadda @BJP4Telangana pic.twitter.com/3Cvafg7dAn
— AP Jithender Reddy (@apjithender) July 1, 2023