BJP : త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకం..

త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం సంస్థాగతంగా భారీ మార్పులు చేయనుంది. దీంతో ఏ క్షణమైనా పార్టీలో మార్పులపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.

BJP : త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకం..

Central cabinet expansion

Updated On : June 29, 2023 / 12:20 PM IST

Central cabinet expansion : కేంద్ర కేబినెట్, బీజేపీలో కొత్త మార్పులు జరగనున్నాయి. మరో రెండు వారాల్లోనే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. దీని కోసం బుధవారం రాత్రి (జూన్ 28, 2023) ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో బీజేపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. మంత్రి వర్గ విస్తరణలో మార్పులు.. పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియమాకం వంటి పలు కీలక అంశాలను చర్చించినట్లుగా సమాచారం.

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం సంస్థాగతంగా భారీ మార్పులు చేయనుంది. దీంతో ఏ క్షణమైనా పార్టీలో మార్పులపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. దీంట్లో భాగంగానే ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ లకు కొత్త బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నట్లుగా సమాచారం. అలాగే పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించనుంది బీజేపీ అధిష్టానం. గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకం జరుగనుంది.

Bandi Sanjay : తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి మార్పు పంచాయతీ.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించనుందనే వార్తల్లో భాగంగానే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుల కూడా జరుగనున్నాయని వార్తలు వచ్చాయి. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ .. అధ్యక్షుడి మార్పు ఉంటుందో లేదో మా నడ్డాను అడిగి చెబుతాను అంటూ సెటైర్లు వేశారు. అధ్యక్షుడి మార్పు మీడియా సృష్టేనంటూ కొట్టిపారేశారు. పదే పదే చెప్పడం మీడియాకు అలవాటు అయ్యింది. వినడం మా కార్యకర్తలకు అలవాటు అయ్యింది అని బండి సంజయ్ అన్నారు. లీకులు ఎక్కడి నుండి వస్తున్నాయో మాకు సమాచారం ఉంది. లీకులు ఇచ్చే వారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. లీకులకు కారణం ముఖ్యమంత్రి కేసీఆరే అంటూ ఆరోపించారు.