Bandi Sanjay : తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి మార్పు పంచాయతీ.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay : ఆయన పార్టీలో ఏం జరుగుతుందో చూడకుండా పక్క పార్టీలో కుట్రలు చేయడం అలవాటైంది.

Bandi Sanjay : తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి మార్పు పంచాయతీ.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay (Photo : Twitter)

Bandi Sanjay : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై బండి సంజయ్ స్పందించారు. అధ్యక్షుడి మార్పు ఉంటుందో లేదో మా నడ్డాను అడిగి చెబుతాను అంటూ సెటైర్లు వేశారు బండి సంజయ్. అధ్యక్షుడి మార్పు మీడియా సృష్టే. పదే పదే చెప్పడం మీడియాకు అలవాటు అయ్యింది. వినడం మా కార్యకర్తలకు అలవాటు అయ్యింది అని బండి సంజయ్ అన్నారు.

”లీకులు ఎక్కడి నుండి వస్తున్నాయో మాకు సమాచారం ఉంది. లీకులు ఇచ్చే వారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. లీకులకు కారణం ముఖ్యమంత్రి కేసీఆరే. ఆయన పార్టీలో ఏం జరుగుతుందో చూడకుండా పక్క పార్టీలో కుట్రలు చేయడం కేసీఆర్ కు అలవాటైంది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను హత్య చేస్తానన్న వారిని ముందుగా అరెస్టు చేయాలి. ఈటల ఇష్యూ పై కేటీఆర్ స్పందించారు. సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? హత్య చేస్తానన్న వ్యక్తి బహిరంగంగా ప్రెస్ మీట్లు ఎలా పెడతారు? నాపై దాడులు జరిగాయి. రాజాసింగ్ పై దాడులు జరిగాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? అందరికీ భద్రత కల్పించాల్సిందే” అని బండి సంజయ్ అన్నారు.

Also Read.. Padi Kaushik Reddy: ఛీటర్ రాజేందర్.. సింగిల్ గా వస్తా.. చర్చకు సిద్ధమా?: కౌశిక్ రెడ్డి

ఇంకా నిర్ణయం తీసుకోలేదు- కిషన్ రెడ్డి
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పు వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. బీజేపీ చీఫ్ మార్పుపై అధిష్టానం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్ష మార్పుపై ఎవరికీ గందరగోళం లేదన్నారు. అధ్యక్ష మార్పుపై కేంద్ర పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, చర్చ కూడా లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసలీ వార్తలు ఎందుకు వచ్చాయో? ఎందుకు ప్రచారం జరుగుతుందో? తనకు తెలియదన్నారు.

Also Read..Eatala Rajender: అక్కడి నుంచే నా హత్యకు కుట్రలు జరుగుతున్నాయి.. వాళ్లే నాకు చెప్పారు: ఈటల

అధ్యక్షుడి మార్పు వార్తలపై తరుణ్ చుగ్ సీరియస్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మార్పు అంటూ వస్తున్న వార్తలపై రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సైతం స్పందించారు. అధ్యక్షుడి మార్పు అంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అధ్యక్ష మార్పు అంశం అధిష్టానం దృష్టిలో లేదన్నారు. అదే విధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగతారని తరుణ్ చుగ్ తేల్చి చెప్పారు. ఈ అంశంపై పదే పదే ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇదివరకే దీనిపై స్పష్టత ఇచ్చామని, అయినా ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని తరుణ్ చుగ్ సీరియస్ అయ్యారు.