Padi Kaushik Reddy: ఛీటర్ రాజేందర్.. సింగిల్ గా వస్తా.. చర్చకు సిద్ధమా?: కౌశిక్ రెడ్డి

తనను చంపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఈటల రాజేందర్, ఆయన సతీమణి చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తోసిపుచ్చారు.

Padi Kaushik Reddy: ఛీటర్ రాజేందర్.. సింగిల్ గా వస్తా.. చర్చకు సిద్ధమా?: కౌశిక్ రెడ్డి

kaushik reddy react on eatala rajender threat allegations

MLC Padi Kaushik Reddy: ఈటల రాజేందర్ (Eatala Rajender) ను హత్యచేయించాల్సిన అవసరం తనకు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. 10టీవీ లైవ్ (10Tv Live) ఇంటర్వ్యూలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. సానుభూతి కోసం ఈటల దంపతులు డ్రామా చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇటీవల చేసిన సర్వేల్లో తానే గెలుస్తానని తేలడంతో ఈటల దంపతులు కొత్త నాటకానికి తెర తీశారని ఆరోపించారు. తనను ఎదుర్కొలేక సింపతీ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. ఈటల కోసం 20 కోట్లు కాదు కదా.. 20 వేల రూపాయలు కూడా ఖర్చు చేయనని చెప్పారు. ఈటల నుంచి తనకు కూడా ప్రాణహాని ఉందన్నారు. 2018లో తనపై హత్యాయత్నం చేశారని చెప్పారు. ఈటల దంపతుల మీడియా సమావేశం పెట్టిన కొద్దిసేపటికే కేంద్రం ఆయనకు సెక్యురిటీ ఇస్తున్నట్టు ప్రకటించడం డ్రామా కాదా అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఈటల భద్రతపై బాధ్యతగల మంత్రిగా కేటీఆర్ స్పందించారని వెల్లడించారు.

ఈటల రాజేందర్ కే నేరచరిత్ర ఉందని.. సాంబశివుడు, ఆయన తమ్ముడు హత్యకు ఆయనే కారణమని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అమరవీరుల స్థూపంపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరవీరుల స్థూపాన్ని కూల్చలేదని.. రోడ్డు విస్తరణ కోసం మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం మేరకు వేరే చోటుకు తరలించినట్టు చెప్పారు. తనంటే ఎందుకు ఈటల భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ను రాజకీయంగా కూల్చేది తానేనని ప్రకటించారు. హుజురాబాద్ ప్రజలకు తానేంటో తెలుసనని అన్నారు.

Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వై-కేటగిరీ భద్రత..!

ఈటలతో చర్చకు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి సింగిల్ వస్తానని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ లో తాను గెలవకపోతే ముక్కు నేలకు రాసి రాజకీయాలకు దూరంటా ఉంటానని సవాల్ విసిరారు. ఎవరూ ఊహించని విధంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానని దీమా వ్యక్తం చేశారు. 6 నెలల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో సెన్సేషనల్ సంఘటనలు జరగబోతున్నాయని తెలిపారు. అబద్దపు రాజకీయాలు చేస్తున్న ఈటలను ఈ రోజు నుంచి ఛీటర్ రాజేందర్ గా పిలుస్తానని అన్నారు.