×
Ad

Komatireddy Rajagopal Reddy : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకెళ్లక తప్పదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకెళ్లక తప్పదన్నారు.

  • Published On : March 4, 2023 / 02:41 PM IST

Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకెళ్లక తప్పదన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సంపాదించిన అవినీతి సొమ్మును డిల్లీలో పెట్టి కవిత 600 షాపులు తీసుకున్నారని ఆరోపించారు. నిజం నిప్పులాంటిదన్నారు.

పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసేందుకే బీఆర్ఎస్ డ్రామాకు తెరలేపారని విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదన్నారు. కుటుంబ పాలనను దించాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా అందరిపై ఉందని తెలిపారు. మోదీ నాయకత్వంలోని బీజేపీతోనే తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవచ్చని చెప్పారు.

Komatireddy VenkatReddy Meets PM Modi : ప్రధానితో చర్చించిన అన్ని విషయాలు చెప్పలేను : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తనను రాజకీయంగా ఎదుర్కోలేక రేవంత్ రెడ్డి, కేటీఆర్ లు కలిసి తాను అమ్ముడుపోయానని దుష్ప్రచారం చేశారని పేర్కొన్నారు. వారికి దమ్ముంటే తాను ఏమి అవినీతి చేశానో నిరూపించాలని సవాల్ చేశారు. రాజగోపాల్ రెడ్డిని కొనే శక్తి ఇప్పటి వరకు పుట్టలేదు, పుట్టబోదని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనను బొందబెట్టే వరకు తన పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.