Huzurabad:ఈటలే కాదు కేసీఆర్ వచ్చిన స్వాగతిస్తా : పెద్దిరెడ్డి

బీజేపీలోకి ఈటల రాజేందరే కాదు కేసీఆర్ వచ్చినా స్వాగతిస్తామని పెద్దిరెడ్డి అన్నారు. ఈటల బీజేపీలో చేరిన నాటినుంచి హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఆ స్థానంలో ఈటలనే అభ్యర్థిగా బీజేపీ నిలబెడతారా? లేదా మరో నేతలకు అవకాశం ఇస్తారా?అనే విషయం పెద్ద చర్చనీయాంశంగా మారిన క్రమంలో పెద్దిరెడ్డి హుజూరాబాద్ లో పర్యటించటం ఇంకాస్తా ఆసక్తికరంగా మారింది.

Bjp Peddireddy Comments

Peddireddy commented on Itala Rajender joining the BJP: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి పర్యటించిన సందర్బంగా ఈటల రాజేందర్ బీజేపీలో చేరటంపై ఆయన స్పందిస్తూ..బీజేపీలోకి ఈటల రాజేందరే కాదు కేసీఆర్ వచ్చినా స్వాగతిస్తామని అన్నారు. ఈటల బీజేపీలో చేరిన నాటినుంచి హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఆ స్థానంలో ఈటలనే అభ్యర్థిగా బీజేపీ నిలబెడతారా? లేదా మరో నేతలకు అవకాశం ఇస్తారా?అనే విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

హుజూరాబాద్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరే పోటీ చేస్తారా?బీజేపీ అధిష్టానం మీకే అవకాశం ఇస్తుందని అనుకుంటున్నారా? లేదా ఈటలకే అవకాశం ఇస్తారని అనుకుంటున్నారా? అని మీడియా ప్రశ్నించగా దానికి సమాధానంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ..అభ్యర్థి ఎన్నికల సమయంలోనే దీనిపై స్పందిస్తాననీ..హుజూరాబాద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అధిష్టానం కల్పిస్తే తప్పకుండా పోటీ చేస్తానని తెలిపారు. ఇక్కడ పోటీ చేసే బీజేపీ అభ్యర్థి గురించి అప్పుడే ఆలోచిస్తాం అని అన్నారు.

2014 ఎన్నికల్లోనే తాను హుజూరాబాద్ నుంచి పోటీ చేద్దామనుకున్నాననీ కానీ అప్పుడు కుదరలేదని ఆ తరువాత కూడా ఎందుకో నాకు అవకాశం రాలేదని కానీ పోటీ చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. ఇటీవల కాలంలో పెద్దిరెడ్డి కేసీఆర్ ను కలిసాడనే వార్తలపై కూడా పెద్దిరెడ్డి స్పందించారు. కేసీఆర్ ను నేను కలవలేదని..ఆయన ఫామ్ హౌస్ ఎక్కడుందో కూడా నాకు తెలీయదని స్పష్టంచేశారు.

కాగా..మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన అనతరం..పెద్దిరెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత రెండు రోజుల క్రితమే ఈటల బీజేపీలో చేరారు. ఆయన హుజూరాబాద్‌ నుంచి బీజేపీ తరపున పోటీ చేయనున్నారని ప్రచారం కూడా జోరుగా జరుగుతున్న క్రమంలో పెద్దిరెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడం ఇప్పుడు సర్కాత్రా ఉత్కంఠను రేపుతోంది.