మోదీ ఏమిచ్చిండో.. సీఎం రేవంత్, హరీష్ కోసమే ఈ బుక్ : రఘునందన్ రావు

జాం షుగర్ ఫ్యాక్టరీ కోసం కేసీఆర్ ప్రభుత్వం హౌస్ కమిటీ వేసింది. 100 రోజుల్లో నివేదిక ఇచ్చింది. దానిని అమలు చెయ్యండి.. కోడ్ అడ్డం వస్తె స్పెషల్ పర్మిషన్ తీసుకొస్తామని రఘునందన్ రావు అన్నారు.

Raghunandan Rao : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ పార్లమెంట్ కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలతో పుస్తకంను సీఎం రేవంత్ రెడ్డికి కొరియర్ చేసినట్లు చెప్పారు. తెలుగు పుస్తకమే పంపిస్తున్న చదువుకో అంటూ రేవంత్ రెడ్డిపై రఘునందన్ రావు సెటైర్లు వేశారు. మా ఊరికి మీరొస్తే మా అమ్మా,నాన్నల గడీలను మీ పేరుమీద రిజిస్ట్రేషన్ చేస్తా. మీకు రాసిచ్చే స్క్రిప్ట్ తప్పులు ఇచ్చారు.. అందుకే ఒక బుక్ రాసుకొచ్చా.. ఓపికగా చదువుకో రేవంత్ అంటూ రఘునంద్ రావు సూచించారు. ఏ గుడికి, ఏ బడికి ఎన్ని పైసలు ఇచ్చినమో బుక్ లో ఉన్నాయి. ఒక దుబ్బాక నియోజకవర్గంలోనే రైతు ఉపాధి పథకం కింద రూ.230 కోట్లు ఇచ్చాం. మోదీ ఏమిచ్చిండో.. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలిపేందుకే ఈ బుక్ అని రఘునందన్ రావు అన్నారు.

Also Read : Khammam : ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిపై వీడిన సస్పెన్స్..! అధికారిక ప్రకటనే తరువాయి

నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం కేసీఆర్ ప్రభుత్వం హౌస్ కమిటీ వేసింది. 100 రోజుల్లో నివేదిక ఇచ్చింది. దానిని అమలు చెయ్యండి.. కోడ్ అడ్డం వస్తె స్పెషల్ పర్మిషన్ తీసుకొస్తామని రఘునందన్ రావు అన్నారు. ఎమ్మెల్యేగా వద్దనుకున్న జీవన్ రెడ్డిని కేంద్ర మంత్రి అవుతుడు అని రేవంత్ రెడ్డి కలలు కంటుండు అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి.. నన్ను మల్కాజిగిరి రమన్నావు కదా.. నేను అడుగుతున్న మెదక్ కు రా పోటీ చేద్దాం. కేటీఆర్ నువ్వు కరీంనగర్ లో బండి సంజయ్ మీద పోటీచేసి గెలుపు ఫస్ట్ అంటూ కౌంటర్ ఇచ్చారు. కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించింది బీజేపీ అని గుర్తుంచుకోవాలని సూచించారు.

Also Read : పార్టీల ఉచిత హామీలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పంచ్ డైలాగులు

కాసాని 90 బీసీ కులాలను ఏకం చేశాడు అంటున్నారు. కాసానికి ఏం ఇచ్చింది బీఆర్ఎస్. బీసీలకు 55 సీట్లు ఇచ్చింది బీజేపీ, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పింది బీజేపీ. మెదక్ లో ఏడు ఎమ్మెల్యే స్థానాలకు ఐదు ఎమ్మెల్యే స్థానాలు బీసీలకు ఇచ్చిన ఘనత బీజేపీదని రఘునందన్ రావు అన్నారు. రాహూల్ గాంధీ నాయత్వంలో కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో ట్రిబుల్ డిజిట్ రాదు. అహంకారతో మోదీ, బోడీలు అని రేవంత్ రెడ్డి మాట్లాడొద్దు. ఒక నాణేనికి బొమ్మా, బొరుసు లాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ అని రఘునందన్ రావు విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు