Vijayashanthi Comments BRS : ప్రజలను దోచుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం : బీజేపీ నేత విజయశాంతి

బీఆర్ఎస్ పై బీజేపీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేేశారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. హత్యలు పెరిగి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Vijayashanthi Comments BRS : బీఆర్ఎస్ పై బీజేపీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేేశారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. హత్యలు పెరిగి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని అరికట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ రెండు అంశాలకు వ్యతిరేకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతలు నిరసన దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా  విజయశాంతి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్కొన్నారు. డ్రగ్స్ కు తెలంగాణ అడ్డగా మారినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు. మద్యాన్ని ఏరులా పారించి, ప్రజలను దోచుకోవడమే బీఆర్ఎస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆరోపించారు.

Vijayashanti : భవిష్యత్ లో టీఆర్ఎస్ ఉండదు : విజయశాంతి

కేసీఆర్ కు ప్రజలు ఓటేసిన పాపానికి తెలంగాణ చావుల రాష్ట్రంగా మారిందన్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణ గురించి మాట్లాడకుండా సిసోడియా అరెస్టు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఓటేసిన పాపానికి రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ మరణ శిక్ష వేస్తున్నాడని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించితే తప్ప రాష్ట్రం బాగుపడదు.. చావులు ఆగవు అని అన్నారు. బీజేపీ ప్రతి విషయంపై కొట్లాడటానికి సిద్ధమైందన్నారు.

మహిళకు ఎన్ని టికెట్లు ఇచ్చారో చెప్పాలి
బీజేపీ అధికార ప్రతినిధి రాణీ రుద్రమ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో నేరాలు రెండింతలు పెరిగాయని అన్నారు. మహిళల హత్యలు, అత్యాచారాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో డ్రగ్స్, మద్యం, గంజాయి పాలసీలు నడుస్తున్నాయని విమర్శించారు.

Vijayashanti: ప్రభుత్వం మారితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది-విజయశాంతి

సంక్షేమ హాస్టళ్లలో వసతులు లేక బాలికలు ఇబ్బందులు పడుతున్నారని. పాఠశాలల్లో మరుగుదొడ్లు సరిగా లేవన్నారు. కేసీఆర్ కు బుద్ది జ్ఞానం ఉంటే ప్రభుత్వ కళాశాలల్లో, ఆఫీసుల్లో టాయిలెట్లు కట్టించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు మహిళా రిజర్వేషన్ అని మాట్లాడటానికి సిగ్గుండాలని.. ఎంతమంది మహిళకు టికెట్లు ఇచ్చారో ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు. బీజేపీ అన్నీ కమిటీలలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ అమలు చేస్తోందని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు