Vijayashanti : భవిష్యత్ లో టీఆర్ఎస్ ఉండదు : విజయశాంతి

కేసీఆర్ కుటుంబంలో సీఎం స్థానం కోసం వార్ మొదలైందని..ప్రగతి భవన్ లో కుస్తీ ఫైటింగ్ జరుగుతుందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. కుటుంబ పంచాయితితో కేసీఆర్ తల పట్టుకుంటున్నారని చెప్పారు.

Vijayashanti : భవిష్యత్ లో టీఆర్ఎస్ ఉండదు : విజయశాంతి

Vijayashanthi

Updated On : November 26, 2021 / 4:22 PM IST

Vijayashanti criticized CM KCR : కేసీఆర్ కుటుంబంలో ముఖ్యమంత్రి స్థానం కోసం వార్ మొదలైందని…ప్రగతి భవన్ లో కుస్తీ ఫైటింగ్ జరుగుతుందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. కుటుంబ పంచాయితో కేసీఆర్ తల పట్టుకుంటున్నాడని పేర్కొన్నారు. తెలంగాణలో భవిష్యత్ లో టీఆర్ఎస్ ఉండదని జోస్యం చెప్పారు. కేసీఆర్ మోసపూరిత విధానాలు అవలంభిస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్ మాటలను ఎవరూ నమ్మడం లేదని విమర్శించారు. కుటుంబ కొట్లాటల నుంచి రిలీఫ్ కోసం ఢిల్లీ పర్యటన కు వెళ్ళారని విమర్శించారు. కేసీఆర్ గురించి పీహెచ్ డీ చేశాను.. ఆయన ఏది చెప్తే అది చేయరని అన్నారు.

Tirupati : వింత ఘటన..వాటర్‌‌ట్యాంక్ పైకి ఎందుకొచ్చిందంటే

కాంగ్రెస్.. టీఆర్ఎస్ కు స్టెప్నీ.. తన అవసరాల కోసం కాంగ్రెస్ ను వాడుకుంటారని ఆరోపించారు. టీఆర్ఎస్ కు సీట్లు తక్కువ పడితే ఆ పార్టీ సీట్లు వాడుకుంటారని పేర్కొన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటేనని విమర్శించారు. తాను ఎక్కడ పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. కేసీఆర్ పై కచ్చితంగా విచారణ ఉంటుందని చెప్పారు. ఇతర పార్టీల నేతలు తమతో టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు.