Tirupati : వింత ఘటన..వాటర్‌‌ట్యాంక్ పైకి ఎందుకొచ్చిందంటే

ఇలాంటి ఘటనలు చాలా ప్రాంతాల్లో జరిగాయని.. కానీ తిరుపతి ప్రజలకు ఇది కొత్త విషయమంటున్నారు.

Tirupati : వింత ఘటన..వాటర్‌‌ట్యాంక్ పైకి ఎందుకొచ్చిందంటే

Tank Tirupathi

Water Tanker Lifted From The Ground : తిరుపతిలో భూమిలోంచి వాటర్ ట్యాంక్‌ గాల్లో తేలిన ఘటనపై.. క్లారిటీ ఇచ్చారు శాస్త్రవేత్తలు. ఇలాంటి ఘటనలు చాలా ప్రాంతాల్లో జరిగాయని.. కానీ తిరుపతి ప్రజలకు ఇది కొత్త విషయమంటున్నారు. తిరుమల శ్రీకృష్ణనగర్‌లో భూమి పొరల్లోంచి.. వాటర్‌ ట్యాంక్ ఒక్కసారిగా బయటకు రావడం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో.. ఘటనపై స్పందించారు భూగర్భ శాస్త్రవేత్తలు. భూమిలోంచి బయటకు వచ్చిన ట్యాంక్‌ను పరిశీలించారు. ఇది సహజ పరిణామమే అని చెబుతున్నారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాల కారణంగా భూమి లోపలి పొరలు బాగా నానిపోవడం వల్లనే.. వాటర్ ట్యాంక్ ఉబికి వచ్చిందని చెబుతున్నారు జియాలజిస్టులు.

Read More : Caste not change if religion changes : మతం మారినంత మాత్రాన కులం మారదు.. హైకోర్టు సంచలన తీర్పు

50 ఏళ్ల తర్వాత తిరుపతిలో భారీ వర్షాలు కురిశాయని.. భారీ వరదల వల్ల భూమి లోపలి పొరలు దెబ్బతిన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఘటన జరిగి ప్రాంతం నాలుగు రోజుల పాటు వరద నీటి ముంపునకు గురైందని.. వరదల వల్ల భూమి పొరల్లో కదలికలు వచ్చాయని చెప్పారు. నీటి ఉధృతి ఒక్కసారిగా రావడంతో.. ఆ ప్రెజర్‌కి ట్యాంక్‌ పైకి వచ్చేలా చేశాయని క్లారిటీ ఇచ్చారు శాస్త్రవేత్తలు. ట్యాంక్‌ కింద ఇసుక ఉండటం వల్లనే ఇలా జరిగిందని.. ట్యాంక్‌ చుట్టూ కాంక్రీట్‌ బేస్‌ ఉంటే ఇలా జరిగేది కాదంటున్నారు జియాలజిస్టులు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని.. ఇప్పుడు జరిగిన ఘటనతో.. చుట్టు పక్కల ప్రాంతాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని కూడా చెప్పారు. కొన్ని సందర్భాల్లోనే ఇలాంటి ఘటనలు జరుగుతాయని..  తిరుపతి ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదంటున్నారు భూగర్భ శాస్త్రవేత్తలు.