BJP Leader Vikram Goud
BJP Leader Vikram Goud : ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టికెట్ ఆశించి భంగపడిన ఆశావహలు పార్టీలు మారుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి నేతలు పార్టీలు మారుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ బీజేపీ నేత విక్రమ్ గౌడ్ పార్టీ మారే ఆలోచనలోఉన్నారు.
విక్రమ్ గౌడ్ బీజేపీ గోషా మహల్ టికెట్ ఆశించి బంగపడ్డారు. నిన్న(ఆదివారం) కిషన్ రెడ్డిని కలిసి విక్రమ్ గౌడ్ తన ఆవేదన చెప్పుకున్నారు. వేరే నియోజకవర్గంలో సద్దుబాటు చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా, రాజాసింగ్ పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ ఎత్తివేసిన విషయం తెలిసిందే.
Shock To BRS : ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు భారీ షాక్.. మరో ఇద్దరు నేతలు రాజీనామా
సస్పెన్షన్ ను ఎత్తివేయడమే కాకుండా గోషా మహల్ అసెంబ్లీ స్థానాన్ని రాజాసింగ్ కు కేటాయించింది. దీంతో విక్రమ్ గౌడ్ కు అక్కడి నుంచి టికెట్ లభించలేదు. దీంతో విక్రమ్ గౌడ్ తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గోషా మహల్ సీటు తనదేనని, అక్కడి నుంచి తానే పోటీ చేస్తానని గతంలో విక్రమ్ గౌడ్ చెప్పడం గమనార్హం.
మరోవైపు అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు టచ్ లోకి రావడంతో విక్రమ్ గౌడ్ పార్టీ మరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విక్రమ్ గౌడ్ తో బీఆర్ఎస్, ఎంఐఎం టచ్ లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈనేపథ్యంలో విక్రమ్ గౌడ్ ఏ పార్టీలో చేరుతారో చూడాలి మరి.