bjp mla raghunandan rao
BJP MLA Raghunandan Rao : ఎమ్మెల్యే రఘునందన్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యార్ధులపై తెలంగాణ ప్రభుత్వం అణచివేత ధోరణికి పాల్పడుతోంది అంటూ విమర్శించారు. కాకతీయ యూనివర్శిటీలో వివిధ విభాగాల్లోని పీహెడ్ డీ కేటగిరి-2 అమ్డిషన్స్ లో అవకతవకలు జరిగాయంటు విద్యార్ధి సంఘాలు సెప్టెంబర్ (2023)5 న మధ్యాహ్నం ఆందోళన చేశాయి. వీసీ ఛాంబర్ లోకి దూసుకెళ్లి వీసీ రమేష్ , రిజిస్ట్రార్ తో వాగ్వాదానికి దిగారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారనే ఆరోపణలతో పోలీసులు విద్యార్ధులకు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్ధులు, సంఘ నాయకులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో పలువురు విద్యార్ధులకు పోలీసులు అదుపలోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందిస్తు విద్యార్ధులపై పోలీసుల వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. పోలీసులు వైఖరిని ఖండిస్తున్నానని అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ లాంటి మహా నేతలను కేయూ అందించింది.విద్యార్థులను రౌడిలుగా, క్రిమినల్స్ గా చిత్రీకరిస్తున్నారు అంటూ మండిపడ్డారు.సీపీ రంగనాథ్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.దేశ భవిష్యత్తు విద్యార్థులపై కేసులు పెట్టడం దారుణమన్నారు.భద్రత మాదే బాధ్యత మాదే అనే రింగ్టోన్ పెట్టుకోగానే సరిపోదు..ముద్దాయిని పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ నిర్వహించారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.ఆర్ ఎం ఓ ను పక్కన పెట్టుకోడం ఎందుకు..?అధికారం ఉందని, యూనిఫాం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించొద్దు అంటూ పోలీసులపై మండిపడ్డారు.
Revanth Reddy : నేను పీసీసీ చీఫ్ అయ్యాకే తెలంగాణ కాంగ్రెస్‌కి ప్రాధాన్యత పెరిగింది : రేవంత్ రెడ్డి
అరెస్ట్ చేసిన విద్యార్దులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర స్టేషన్లకు తరలించారు అంటూ మండిపడ్డారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థులను కోర్టులో ప్రవేశపెట్టకుండా ఇంటరాగేషన్ చేశారు. విద్యార్థులను టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి ఎందుకు తీసుకెళ్లారు? గన్ పెట్టీ నేను విద్యార్థులను బెదిరించలేదు అని ప్రెస్ మీట్ పెట్టీ చెప్పాల్సిన అవసరం సీపీకి ఎందుకు వచ్చింది..? అంటూ ప్రశ్నించారు.చట్టానికి లోబడి పనిచేయని మీకు సీపీ గా పనిచేసే అర్హత లేదన్నారు.హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత మీ పై విచారణకు సిద్దంగా ఉన్నారా..?ఎవరో చెప్పారని మీరు అనందర్ని మేనేజ్ చేసి విద్యార్థులపై కక్ష గట్టారని…చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్మనది విద్యార్ధులు కాదు వరంగల్ సీపీ అంటూ ఆరోపించారు. మేం చట్టాన్ని గౌరవిస్తాం, దారి తప్పితే సరైన దిశలో వెళ్లేలా ఒత్తిడి తెస్తాం అంటూ హెచ్చరించారు.
సీపీ గారు… చట్టాలకు లోబడి పనిచేయండి మీరు కొమ్ముకాసే ఈ ప్రభుత్వం ఇంకో నాలుగు నెలలే ఉంటుంది…మీరు చేసిన పనులకు సమాధానం చెప్పల్సి ఉంటుంది..పోలీసులు, సీపీపై చర్యలు తీసుకోవాలని మానవహక్కుల సంఘాన్ని, కోర్టులను ఆశ్రయిస్తామని అన్నారు. పీహెచ్ డీ అక్రమాలపై విచారణ జరపండి అంటూ డిమాండ్ చేశారు.