MLA Raghunandan Rao: సడెన్‌గా ఫోన్ నెంబర్ ఎందుకు మారింది? మరోసారి మంత్రి నిరంజన్‌పై రఘునందన్ సంచలన ఆరోపణలు

చైనా‌లో మో అనే వ్యక్తి‌తో నిరంజన్ రెడ్డి రెగ్యులర్‌గా మాట్లాడే వారు. ఆ వ్యక్తి అమెరికా‌లో వ్యాపారాలు చేసే మరో వ్యక్తి‌తో సంప్రదింపులు జరిపే వాడు.

BJP MLA Raghunandan Rao

MLA Raghunandan Rao: మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) , బీజేపీ ఎమ్మెల్యే రఘునంద్ రావు (BJP MLA Raghunandan Rao) ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మంత్రి పై ఇటీవల రఘునందన్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. రఘునందన్ వ్యాఖ్యలకు స్పందించిన మంత్రిసైతం సవాల్ చేశారు. ఆ రోపణలను నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. తాజాగా మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్‌గా రఘునందన్ మరికొన్ని విషయాలను తెరపైకి తెచ్చి ప్రశ్నల వర్షంకురిపించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి పై ఈడీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

Raghunandan Rao: మంత్రి నిరంజన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు

చైనా‌లో మో అనే వ్యక్తి‌తో నిరంజన్ రెడ్డి రెగ్యులర్‌గా మాట్లాడే వారని, ఆ వ్యక్తి అమెరికా‌లో వ్యాపారాలు చేసే మరో వ్యక్తి‌తో సంప్రదింపులు జరిపే వాడని రఘునందన్ చెప్పారు. మో అనే వ్యక్తి‌తో మంత్రి నిరంజన్ రెడ్డి జరిపిన ట్రాన్సక్షన్‌పై విచారణ జరపమని కోరతానని అన్నారు. దత్త పుత్రుడు గౌడ నాయక్‌పై ఐటీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని, అతను కొన్న భూములు వైట్ మనీతో కొన్నారా..? ఎంత పన్ను కట్టారు అనే విషయాలు బయటకు వస్తే అసలు విషయం తెలుస్తుందని రఘునందన్ పేర్కొన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ‌లో వీసీ‌గా వియ్యంకుడిని మంత్రి నియమించుకున్నారని ఆరోపించారు.

Minister Niranjan Reddy: ఒక్క ఆరోపణ రుజువు చేసినా రాజీనామా చేస్తా.. బీజేపీ ఎమ్మెల్యేకు మంత్రి నిరంజన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

మంత్రి సడెన్‌గా ఫోన్ నెంబర్ మార్చాల్సిన అవసరం ఏముందని రఘునందన్ ప్రశ్నించారు. మొబైల్‌ను మార్చడం వెనకనే ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం తగలబడిందనే ఆర్డీవో కార్యాలయంలో ఆర్టీఐ ధరఖాస్తు చేశా.. సమాచారం ఇవ్వలేదు. ఆర్డీవో కార్యాలయం‌లో రికార్డులు ఉంటే రైతులకు ఎందుకు పహానీలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నదికి డీ సిల్టింగ్ చేశాడని నేను ఆరోపించానని చెప్పిన రఘునందన్, దత్తపుత్రుడి‌కి ఎలా కాంట్రాక్టులు వచ్చాయని మంత్రిని ప్రశ్నించారు. మంత్రి నాలుగు కోట్లకే పొలం, ఇల్లు అమ్ముతా అంటే కొంటానని రఘునందన్ అన్నారు.