Raghunandan Rao: మంత్రి నిరంజన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
Raghunandan Rao: మంత్రి నిరంజన్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు పలు అంశాలపై నిలదీశారు. అలాగే, ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేసీఆర్ ను ప్రశ్నించారు.

Raghunandan Rao
Raghunandan Rao: తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో వ్యవసాయశాఖ మంత్రి అక్రమంగా ఫాంహౌస్ కట్టారని చెప్పారు.
ఏకంగా నదినే కజ్జా చేసి నదిలో ప్రహరీ గోడ కట్టారని ఎమ్మెల్యే రఘునందనరావు తెలిపారు. 80 ఎకరాలు కొని.. 165 ఎకరాలకు కాంపౌడ్ వాల్ ఎందుకు కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణాదిని కబ్జా చేసి మంత్రి నిరంజన్ రెడ్డి నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు. రికార్డులు బయటకు రాకుండా ఉండేందుకు తహసీల్దార్ కార్యాలయం తగలబడినంట్లుందని ఆరోపించారు.
వ్యవసాయ, హార్టీకల్చర్ సబ్సిడీలు, లోన్లను.. బినామీలు, ఇతర పేరుతో మంత్రి కుటుంబ సభ్యులు పొందారని ఎమ్మెల్యే రఘునందనరావు చెప్పారు. ఆర్డీఎక్స్ ప్రాజక్టుకు చెందిన భూములను కూడా వ్యవసాయశాఖ మంత్రి వదల్లేదని అన్నారు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని రాష్ట్రం ఏర్పడినప్పుడు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సవాలు విసిరారు.
గతంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేస్తూ ఈటల రాజేందర్ వంటి వారిని మంత్రి పదవి నుంచి తొలగించిన కేసీఆర్.. మరి ఇప్పుడు కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమాలను పాల్పడ్డ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే రఘునందనరావు ప్రశ్నించారు.
Jogi Ramesh: పవన్ కల్యాణ్ “హైదరాబాద్” వాసి.. హరీశ్ రావు ఏపీకి రావాలి: ఏపీ మంత్రి జోగి రమేశ్