Raja Singh : ఆవులను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి-రాజాసింగ్

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ గేట్ వద్ద అక్రమంగా అంబులెన్స్ లో  తరలిస్తున్న ఆవులు సజీవ దహనం   అయిన ఘటనపై  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.

Raja Singh : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ గేట్ వద్ద అక్రమంగా అంబులెన్స్ లో  తరలిస్తున్న ఆవులు సజీవ దహనం   అయిన ఘటనపై  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈఘటనపై సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ ఘటన వెనుక ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

శనివారం రాత్రి నిజామాబాద్ నుంచి అంబులెన్స్ లో ఆవులను కబేళాకు తరలిస్తుండగా జరిగిన అగ్ని ప్రమాదంలో 13 ఆవులు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం సంభవించటంతో   డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు.  ఈ ఘటనలో అంబులెన్స్ లో తరలిస్తున్న ఆవులు సజీవ దహనమయ్యాయి. అంబులెన్స్‌ను, చనిపోయిన ఆవులను ఖాళీ ప్రదేశానికి తరలించారు పోలీసులు.

వెటర్నరీ వైద్యులు ఆవులకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. అటు ఆవుల అక్రమ రవాణాకు పాల్పడింది ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంబులెన్స్‌ రిజిస్ట్రేషన్, టోల్ ప్లాజా దగ్గర సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు