BJP MP Laxman: టాటా కాంగ్రెస్, బైబై బీఆర్ఎస్, వెల్‌క‌మ్‌ బీజేపీ అనే నినాదం ప్రజల్లో నడుస్తుంది

కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. కార్ షెడ్డుకు పోవటం ఖాయం. టాటా కాంగ్రెస్, బై బై బీఆర్ఎస్, వెల్ కమ్ బీజేపీ అనే నినాదం ప్రజల్లో నడుస్తుందని లక్ష్మణ్ అన్నారు.

BJP MP Laxman

Telangana Elections 2023: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని, ప్రజల మద్దతు చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మంగళవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. మోదీ రోడ్ షో సూపర్ సక్సెస్ అయింది, అన్నివర్గాల ప్రజల నుంచి మద్దతు లభించిందని అన్నారు. బీజేపీ జాతీయ నేతల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, స్వచ్ఛందంగా ప్రజలు బీజేపీ సభలకు హాజరై వారి మద్దతు తెలిపారని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Also Read : Rahul Interaction : చివరి రోజు హైదరాబాద్ లో రాహుల్ గాంధీ ప్రచారం.. వివిధ వర్గాల వర్కర్స్ తో మాటామంతి

బీజేపీ మ్యానిఫెస్టో ప్రజల్లోకి వెళ్లింది. అమలు చేసేదే బీజేపీ ప్రజలకు చెప్పిందని లక్ష్మణ్ అన్నారు. బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ అంశాలు ప్రజలకు చేరాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ప్రజలను నమ్మడం లేదని, కాంగ్రెస్ హామీలు అమలుకావని ప్రజలు తెలుసుకున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని యాడ్స్ ఇచ్చిన, మీడియాలో పెయిడ్ ఆర్టికల్స్ వేసుకున్న ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. కర్ణాటక ప్రజల డబ్బులతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రచారం చేస్తుందని లక్ష్మణ్ ఆరోపించారు.

Also Read : Telangana Assembly Election 2023: పటిష్ట భద్రత నడుమ పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం.. రంగంలోకి కేంద్ర బలగాలు

దళితుడిని సీఎం చేస్తానని, అలా జరగకుంటే తల నరుక్కుంటా అని కేసీఆర్ గతంలో చెప్పారు.. ముక్కు నేలకు రాస్తా అన్నాడు.. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. కార్ షెడ్డుకు పోవటం ఖాయం. టాటా కాంగ్రెస్, బై బై బీఆర్ఎస్, వెల్‌క‌మ్‌ బీజేపీ అనే నినాదం ప్రజల్లో నడుస్తుందని లక్ష్మణ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోకూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లు వచ్చింది లేదు.. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమ, ఆంధ్ర సీట్లతోనే. ఇప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు. ఫేక్ సర్వేలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. ప్రజలు ఫేక్ సమాచారాన్ని నమ్మే స్థితిలో లేరని లక్ష్మణ్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు