Etala Rajender : హుజూరాబాద్ అభ్యర్థిగా ఈటల రాజేందర్.. అధికారికంగా ప్రకటించిన బీజేపీ

హుజూరాబాద్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను బీజేపీ అధికారికంగా ప్రకటించింది. ఈటల పేరును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. హుజూరాబాద్‌లో త్రిముఖ పోరు మొదలైంది.

Etela Rajender

Huzurabad by-election : హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థి పేరు ఖరారు అయింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను బీజేపీ అధికారికంగా ప్రకటించింది. ఈటల పేరును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. హుజూరాబాద్‌లో త్రిముఖ పోరు మొదలైంది. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి.. ప్రచార బరిలోకి దిగాయి.

ఒకవైపు నామినేషన్లు.. మరోవైపు ప్రచారం హుజూరాబాద్‌లో పొలిటికల్ హీట్‌ను పెంచేస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. నేతల పొలిటికల్ కెరియర్‌ను ఈ ఎన్నికలు డిసైడ్ చేయనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్ – బీజేపీ మధ్య నెలకొన్నప్పటికి.. కాంగ్రెస్ పార్టీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

Huzurabad By-Election : హుజూరాబాద్‌లో త్రిముఖ పోరు..టీఆర్ఎస్ – బీజేపీ మధ్యే ప్రధాన పోటీ..!

సిట్టింగ్ సీటు కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా బరిలోకి దింపింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీ ఫామ్ ఇవ్వడం.. గెల్లు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. సిట్టింగ్ సీటే కాబట్టి.. హుజూరాబాద్‌లో గెలుపు సులువే అనే ధీమాలో ఉంది టీఆర్ఎస్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్లేస్‍‌ను పోగొట్టుకోవద్దనే ఉద్దేశ్యంతో.. ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. అలాగే.. ట్రబుల్ షూటర్ హరీశ్‌రావుతో పాటు.. 20 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా డిసైడ్ చేసింది. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గెలుపు కోసం ఇంటింటి ప్రచారానికి టీఆర్ఎస్‌ ప్లాన్ చేస్తోంది.

టీఆర్ఎస్‌ ఎత్తులకు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పైఎత్తులు వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఆయన.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించి.. రాజకీయంగా తానేంటో నిరూపించేందుకు జనాల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే పాదయాత్ర పేరుతో ఓసారి నియోజకవర్గాన్ని చుట్టుముట్టారు. దీంతో పాటు ప్రచారాన్ని సైతం ముమ్మరం చేశారు. అయితే ఈటల బీజేపీలో చేరిన తర్వాత రాజకీయ పరిణామాలు మారినప్పటికి… ఆయనకు ఎంతమంది మద్దతు నిలుస్తారనేది ఆసక్తిగా మారింది.

Etala Challenges : హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా

లేట్‌గా అయినా.. అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఓ కొలిక్కివచ్చాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా విద్యార్థి సంఘం నేతను బరిలోకి దింపింది. పలువురి పేర్లు పరిశీలించిన కాంగ్రెస్ కీలక నేతలు.. NSUI తెలంగాణ అధ్యక్షుడుగా పనిచేస్తున్న బల్మూరి వెంకట్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌వీ నేత గెల్లు శ్రీనివాస్‌కు టికెట్‌ ఇవ్వడంతో..కాంగ్రెస్‌ కూడా అదే వ్యూహంతో ముందుకెళ్తోంది.

కచ్చితంగా.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి.. బీజేపీకి పోటీ ఇచ్చితీరుతామని హస్తం పార్టీ అంటోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో హుజూరాబాద్ ఉప పోరు ప్రచారం హోరెత్తుతుండగా… గెలుపు ఎవరిని వరిస్తుందో ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు ఈటల భవిష్యత్‌నే కాదు.. గెల్లు శ్రీనివాస్, బల్మూరి వెంకట్‌ పొలిటికల్ కేరియర్‌ను డిసైడ్ చేయనున్నాయి.