Million March : బీజేపీ మిలియన్ మార్చ్ వాయిదా

బీజేపీ మిలియన్ మార్చ్ వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది.

Million March : బీజేపీ మిలియన్ మార్చ్ వాయిదా

Bjp

Updated On : November 13, 2021 / 6:48 PM IST

BJP Million March postponed : బీజేపీ మిలియన్ మార్చ్ వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ బీజేపీ ఈ నెల 16న మిలియన్ మార్చ్ తలపెట్టింది. ఇప్పటికే జిల్లా, మండల స్థాయి వరకు మిలియన్ మార్చ్ కు కేడర్ సిద్ధమైంది. ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డ కార్యక్రమం ఎప్పుడు నిర్వహించాలన్నదానిపై తేదీ త్వరలో ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర నాయకత్వం తెలిపింది.

ఈ నెల 16న తలపెట్టిన మిలియన్ మార్చ్, 21 నుండి ప్రారంభించాల్సిన రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో  ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Kishan Reddy : ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది : కిషన్ రెడ్డి

ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత మిలియన్ మార్చ్, రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర కార్యక్రమాలను యధాతథంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే మిలియన్ మార్చ్, ప్రజా సంగ్రామ యాత్ర తేదీలను ప్రకటిస్తామని చెప్పారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడలు వంచేదాకా నిరసనలు, ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.