Kishan Reddy : ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది : కిషన్ రెడ్డి

తెలంగాణలో ఏ రైతు బాయిల్డ్ రైస్ పండించరని...ధాన్యం మాత్రమే పండిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ సమస్య రైతులది కాదని..మిల్లర్లదని తెలిపారు.

Kishan Reddy : ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది : కిషన్ రెడ్డి

Kishanreddy

Kishan Reddy criticized TRS : తెలంగాణలో ఏ రైతు బాయిల్డ్ రైస్ పండించరని…ధాన్యం మాత్రమే పండిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ సమస్య రైతులది కాదని..మిల్లర్లదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై విష ప్రచారం చేస్తోందన్నారు. తప్పు చేసింది ఎవరు? నిందలు ఎవరిమీద వేస్తున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు..ఎవరిపై చేస్తున్నారని నిలదీశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగ్రిమెంట్ ఉందని వెల్లడించారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తారని ఒప్పుకున్నారని..తర్వాత 90 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచమని మరో లేఖ రాశారని తెలిపారు. మరోసారి 108 లక్షల మెట్రిక్ టన్నులు పండుతుందని చెప్పారు. 2014లో ధాన్యం సేకరణ కోసం రూ.3,404 కోట్లు ఖర్చు పెట్టామని పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.26 వేల కోట్లతో కేంద్రం ధాన్యం కొంటోందని చెప్పారు.

Maoist Leader RK : నా భర్త జ్ఞాపకాలతో పుస్తకాన్ని తేవాలనుకున్నా.. పోలీసులు అడ్డుకున్నారు : మావోయిస్టు నేత ఆర్కే సతీమణి

ధాన్యం సేకరణ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. ధాన్యం సేకరణకు డబ్బులు పూర్తిగా కేంద్రం ఇస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్ కోసం కాదు..రైతుల కోసం ధాన్యం కొంటున్నట్లు వెల్లడించారు.

బాయిల్డ్ రైస్ ను చాలా రాష్ట్రాల్లో తినడం లేదని పేర్కొన్నారు. పంజాబ్ లో కూడా బాయిల్డ్ రైస్ కొనడం లేదని వెల్లడించారు. బాయిల్డ్ రైస్ తీసుకోబోమని మూడేళ్లుగా చెప్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఎక్కడ అన్యాయం చేసిందో చెప్పాలన్నారు.