BJP Focus On 4 Assemly Seats
BJP Focus On 4 Assemly Seats : తెలంగాణ ఎన్నికలపై బీజేపీ ఫుల్ ఫోకస్ చేసింది. స్పెషల్ గా బీఆర్ఎస్ ముఖ్యనేతలు పోటీ చేసే స్థానాలను టార్గెట్ చేసుకుంది. కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్, కామారెడ్డితో పాటు కేటీఆర్ బరిలో ఉన్న సిరిసిల్ల, హరీశ్ రావు పోటీ చేస్తున్న సిద్ధిపేటపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ వీరిని కట్టడి చేస్తే బీఆర్ఎస్ ను నిలువరించొచ్చనే యోచనలో ఉంది. దీనికి తగినట్లుగా కార్యాచరణ రూపొందిస్తోంది.
నాలుగు నియోజకవర్గాల్లో జాతీయ నేతలు మకాం వేసేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈ నియోజకవర్గాల్లో మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాల పర్యటనలు ఉండేలా షెడ్యూల్స్ ను ప్రిపేర్ చేస్తోంది.
Also Read : ఈటల సతీమణి జమున రాజకీయ ఆరంగేట్రం చేస్తారా?
ఆ నాలుగు అసెంబ్లీ స్థానాలపై ఫుల్ ఫోకస్..
అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది బీజేపీ. అందులో భాగంగా వ్యూహాలు రచిస్తోంది. గత మూడు రోజులుగా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. ఒకవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతుంటే, మరోవైపు ఎన్నికల వ్యూహాలపైనా చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపై డిస్కస్ చేస్తున్నారు. ఈ క్రమంలో గజ్వేల్, కామారెడ్డి, సిద్ధిపేట, సిరిసిల్ల.. ఈ నాలుగు నియోజకవర్గాల గురించి చర్చ జరిగింది.
టార్గెట్ ఆ ముగ్గురే..
ఈ నాలుగు నియోజకవర్గాలను మేమే చూసుకుంటాము, అక్కడ అభ్యర్థుల ఎంపిక నుండి ప్రచారం వరకు సెంట్రల్ పార్టీనే పర్యవేక్షిస్తుంది. స్టేట్ పార్టీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నేరుగా రాష్ట్ర నేతలకు జాతీయ నేతలు తేల్చి చెప్పినట్లుగా సమాచారం. గజ్వేల్, కామారెడ్డి.. ఈ రెండు చోట్ల నుంచి సీఎం కేసీఆర్.. సిద్ధిపేట నుంచి హరీశ్ రావు, సిరిసిల్ల నుంచి కేటీఆర్ పోటీ చేస్తున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో వారి మెజార్టీ తగ్గించే ప్రయత్నం చేసేందుకు బీజేపీ నేతలు కొంత ప్లాన్ చేసినట్లుగా కనపడుతోంది.
తెలంగాణలోనూ వెస్ట్ బెంగాల్ తరహా వ్యూహం..
గతంలో చూసుకున్నట్లు అయితే వెస్ట్ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ పోటీ చేసిన నియోజకవర్గంలో స్వయంగా బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారిని బరిలోకి దింపి అక్కడ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అక్కడ మమతను ఓడించే పరిస్థితిని తీసుకొచ్చింది. అలాంటి తరహా వ్యూహాన్నే తెలంగాణలోనూ అమలు చేయాలన్నది బీజేపీ ఆలోచన.
Also Read : అసెంబ్లీ బరిలోకి దిగమంటున్న బీజేపీ సీనియర్లు.. వారిద్దరికి మినహాయింపు!
బీఆర్ఎస్ కు చెందిన ఈ ముగ్గురు కీలక నేతలు పోటీ చేసే నాలుగు స్థానాల్లో బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఆ నాలుగు నియోజకవర్గాల్లో కీలకమైన, ఫేస్ వ్యాల్యూ ఉన్న నాయకులను బరిలో నిలపాలని చూస్తోంది బీజేపీ జాతీయ నాయకత్వం. అలాగే ఎన్నికల ప్రచారం, నామినేషన్ల ఘట్టం, పోలింగ్.. ఇలా అన్ని అంశాలను స్వయంగా జాతీయ నాయకత్వమే పర్యవేక్షించనుంది.