BJP Telangana: కాంగ్రెస్ కు కౌంటర్ గా కిషన్ రెడ్డి వ్యూహాలు.. ఈ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా?

ఎన్నికలకు కేవలం వంద రోజులు మాత్రమే ఉండటంతో బీజేపీ తన కార్యాచరణలో దూకుడు పెంచేలా కనిపిస్తోంది. కిషన్ రెడ్డి పార్టీలో తన మార్కు మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు.

BJP Telangana new strategy to counter congress party

BJP Telangana New Strategy: వరుసగా రెండు సార్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో రావడానికి కారణమైన సోషల్ మీడియా ప్రచారాన్నే తెలంగాణ బీజేపీ నేతలు ఎంచుకుంటున్నారా.. బీఆర్ఎస్ (BRS Party) కు బీటీమ్ అంటున్న కాంగ్రెస్ కు కౌంటర్ గా.. రాష్ట్రానికి ఏం చేయలేదంటున్న అధికార బీఆర్ఎస్ లక్ష్యంగా కమలం సేన ఇక సోషల్ మీడియా (Social Media) లో దూసుకుపోవడానికి సిద్ధమవుతోందా.. తాజాగా మీడియా, సోషల్ మీడియా, ఎన్నికల స్ట్రాటజీలను వివరించేందుకు ప్రత్యేక బృందాల ఎంపిక దేనికి సంకేతం.. కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) సోషల్ మీడియా మాధ్యమంగా పార్టీని గెలుపు తీరాలకు చేర్చుతారా.. ఆన్‌లైన్‌ ఎత్తులతో బీజేపీ ఏం సాధించనుంది..? తెరవెనుక (Tera Venuka) జరుగుతున్న రాజకీయమేంటి?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి పార్టీలో తన మార్కు మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ (Prakash Javadekar), సునీల్ బన్సల్‌ (Sunil Bansal)తో కలిసి ఎన్నికల వ్యూహాలపై సమావేశాలు నిర్వహించడంతోపాటు ప్రత్యేక బృందాలను రెడీ చేస్తున్నారు కిషన్‌రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పోల్ వార్ రూం ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించారు కిషన్‌రెడ్డి.. దీనికి ఇన్‌చార్జిగా పార్టీ జాతీయ అధికార ప్రతినిది జాఫర్ ఇస్లాంను నియమించారు. ఇకపై రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి మీడియా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడికక్కడ స్థానిక అంశాలపై కార్యక్రమాలు రూపొందించి జనంలోకి తీసుకువెళ్లనుంది పోల్ వార్ రూం. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన విజయాలు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారం చేయడం పోల్ వార్ రూం ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

మీడియా స్ట్రాటజీ టీం ఇన్‌చార్జిగా శ్వేతా సైనీ (Shveta Saini)ని నియమించారు. ఆమె బీజేపీ కార్యక్రమాలకు మీడియాలో ప్రచారం చేయడంపై స్ట్రాటజీలను రూపొందించనున్నారు. ఇక సోషల్ మీడియా బాధ్యతలను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Arvind Dharmapuri), బీజేపీ నేత యోగానంద్ కు అప్పగించినట్టుగా తెలుస్తోంది. వీరందరినీ సమన్వయం చేసే బాధ్యత సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచద్రరెడ్డికి అప్పగించారు. ప్రతిరోజు ఓ జాతీయ కార్యవర్గ సభ్యుడు మీడియా బ్రీఫింగ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు ఉన్నటువంటి కరంట్ ఇష్యూపైన ఆయా నేతలు మీడియాతో మాట్లాడేలా కార్యాచరణ రూపొందించారు.

Also Read: వైఎస్ షర్మిల బాణం కాంగ్రెస్ చేతికి చిక్కిందా.. అందుకే సికింద్రాబాద్ సీట్‌పై కన్నేశారా?

ఎన్నికలకు కేవలం వంద రోజులు మాత్రమే ఉండటంతో బీజేపీ తన కార్యాచరణలో దూకుడు పెంచేలా కనిపిస్తుంది. మరో రెండు రోజుల్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశమై ఎన్నికల కమిటీలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. 21న సమావేశమైన కోర్ కమిటీ ఎన్నికల నిర్వహణకోసం 22 కమిటీలు వేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆ కమిటీల్లో ఉండాల్సిన పేర్ల జాబితా సైతం సిద్ధం కాగా, 27న జరిగే కోర్ కమిటీలో వాటిని ఫైనల్ చేయనున్నారు. ఇందులో మేనిఫెస్ట్, చార్జిషీట్, లీగల్ సెల్, అడ్మినిస్ట్రేషన్, లిటరేచర్, పబ్లిసిటీ, పబ్లిక్ మీటింగ్స్, టాకింగ్ పాయింట్స్ వంటి 22 కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఇలా ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీజేపీ వ్యూహాలు ఏ మేరకు పనిచేస్తాయో చూడాల్సివుంది.

Also Read: బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మైండ్‌గేమ్‌.. తెరవెనుక రాజకీయంలో మూడూ మూడే!

ట్రెండింగ్ వార్తలు