×
Ad

Bandi Sanjay Praja Sangrama Yatra End : ముగిసిన బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. వరంగల్‌ భద్రకాళి ఆలయానికి బండి సంజయ్ చేరుకున్నారు. ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కలిసి బండి సంజయ్‌ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. యాదాద్రి నుంచి భద్రకాళి ఆలయం వరకు బండి సంజయ్‌ యాత్ర కొనసాగింది.

  • Published On : August 27, 2022 / 03:32 PM IST

Bandi Sanjay Praja Sangrama Yatra End

Bandi Sanjay Praja Sangrama Yatra End : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. వరంగల్‌ భద్రకాళి ఆలయానికి బండి సంజయ్ చేరుకున్నారు. ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కలిసి బండి సంజయ్‌ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. యాదాద్రి నుంచి భద్రకాళి ఆలయం వరకు బండి సంజయ్‌ యాత్ర కొనసాగింది.

ఈ నెల 2న బండి సంజయ్ మూడోవిడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైంది. ఈనెల 26వ తేదీ వరకు చేపట్టాలని తొలుత సంజయ్ భావించారు. మునుగోడు సభ కారణంగా ఒకరోజు పొడిగించారు. మొత్తం 26 రోజుల్లో 21 రోజులు మాత్రమే యాత్ర సాగింది. పలు కారణాలతో 5 రోజులు యాత్రకు బ్రేక్ పడింది.

Praja Sangrama Yatra: నేడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు బహిరంగసభ.. హాజరు కానున్న జేపీ నడ్డా.. షెడ్యూల్ ఇలా..

ఈ నెల 6న ఉపరాష్ట్రపతి ఎన్నికతో యాత్రకు ఒకరోజు బ్రేక్ పడింది. మునుగోడు సభ కారణంగా 21న యాత్రకు విరామం ఇచ్చారు. ఈనెల 23న స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పోలీసుల అడ్డగించారు. బండి సంజయ్ అరెస్టుతో ఈనెల 25వ తేదీ వరకు యాత్ర సాగలేదు. నిన్న జనగామ జిల్లా ఉప్పుగల్లు సరిహద్దు నుంచి పాదయాత్ర పునఃప్రారంభమైంది.