Praja Sangrama Yatra: నేడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు బహిరంగసభ.. హాజరు కానున్న జేపీ నడ్డా.. షెడ్యూల్ ఇలా..

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈరోజు సాయంత్రం 4గంటల సమయంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు బీజేపీ ముఖ్యనేతలు హాజరు కానున్నారు.

Praja Sangrama Yatra: నేడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు బహిరంగసభ.. హాజరు కానున్న జేపీ నడ్డా.. షెడ్యూల్ ఇలా..

Bandi Sanjay Kumar

Praja Sangrama Yatra: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ నెల 2న యాదాద్రి వద్ద ప్రారంభమైన పాదయాత్ర నేడు హన్మకొండలో ముగియనుంది. ఈ సందర్భంగా హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను బీజేపీ నిర్వహించనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆ పార్టీ నేతలు పూర్తి చేశారు. అయితే ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు పాల్గోనున్నారు.

Bandi Sanjay: బీజేపీ సభకు హైకోర్టు అనుమతి.. ప్రశాంతంగా యాత్ర ముగిస్తామన్న బండి

బహిరంగ సభలో పాల్గోనేందుకు జేపీ నడ్డా ఈ రోజు మధ్యాహ్నం 12.40గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఎయిర్ పోర్టు సమీపంలోని నోవాటెల్ హోటల్ లో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరుతారు. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో వరంగల్ జిల్లా కేంద్రంలోని భద్రకాళి అమ్మవారిని నడ్డా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 4.10 నుంచి 5.40 గంటల వరకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే పాదయాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 6గంటల సమయంలో వరంగల్ నుంచి హైదరాబాద్ కు చేరుకొని 6.30 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

Sunil Bansal : రంగంలోకి బన్సల్.. తెలంగాణకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇంఛార్జి.. బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

ఇదిలాఉంటే బహిరంగ సభ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. బండి సంజయ్ చేపట్టిన మూడో విడత పాదయాత్ర ఉధ్రిక్తతల మధ్య కొనసాగింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల కార్యకర్తల మధ్య పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీనికితోడు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. దీంతో రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు పంపించారు. అయితే తొలుత అనుకున్నట్లు హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగాల్సిన మూడో విడత ముగింపు బహిరంగ సభకు ఆటంకం ఏర్పడింది. తొలుత అనుమతి లభించినప్పటికీ.. పాతబస్తీలో, పాదయాత్ర సమయంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు, కళాశాల యాజమాన్యం సభకు అనుమతి నిరాకరించాయి. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో శుక్రవారం మధ్యాహ్నం విచారణ జరిగింది. సభకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో నేడు సాయంత్రం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో సభ జరగనుంది. ముఖ్యఅతిథిగా జేపీ నడ్డా పాల్గోనుండగా..  రాష్ట్ర పార్టీ వ్యవహారాల నూతన ఇన్ ఛార్జి సునీల్ బన్సల్ కూడా సభలో పాల్గోనున్నారు.