Sunil Bansal : రంగంలోకి బన్సల్.. తెలంగాణకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇంఛార్జి.. బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇంఛార్జి సునీల్ బన్సల్ తెలంగాణకు రానున్నారు. హన్మకొండలో జరిగే బీజేపీ సభా స్థలికి వెళ్లనున్నారు. శనివారం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న బీజేపీ సభ ఏర్పాట్లను సునీల్ బన్సల్ స్వయంగా పరిశీలించనున్నారు.

Sunil Bansal : రంగంలోకి బన్సల్.. తెలంగాణకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇంఛార్జి.. బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

Sunil Bansal : బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇంఛార్జి సునీల్ బన్సల్ తెలంగాణకు రానున్నారు. రాత్రి ఏడు గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న బన్సల్ అక్కడి నుంచి నేరుగా హన్మకొండలో జరిగే బీజేపీ సభా స్థలికి వెళ్లనున్నారు. శనివారం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న బీజేపీ సభ ఏర్పాట్లను సునీల్ బన్సల్ స్వయంగా పరిశీలించనున్నారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా ఇటీవలే సునీల్‌ బన్సల్‌ నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆ వెంటనే తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల వ్యవహారాల ఇంఛార్జిగా కూడా బాధ్యతలు అప్పగించారు.

ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్‌గా ఉన్న తరుణ్ చుగ్‌ను తప్పించి.. ఆయన స్థానంలో సునీల్ బన్సల్‌ను నియమించారు. 2014 లోక్‌సభ ఎన్నికల నుండి ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల వరకు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎన్నికల విజయంలో బన్సల్ కీలక పాత్ర పోషించారు. బీజేపీ ముఖ్యనేత అమిత్ షాకు సన్నిహితుడిగా, అమిత్ షా వ్యూహాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో సమర్థుడిగా బీజేపీలో సునీల్ బన్సల్‌కు గుర్తింపు ఉంది.

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న అమిత్ షా.. ఇందులో భాగంగానే సునీల్ బన్సల్‌కు కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. బూత్‌ స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయడంలో సునీల్ బన్సల్‌ చక్కటి వ్యూహంతో ముందుకు సాగుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ బల పుంజుకుంటోందని, ఈ నేపథ్యంలో పార్టీని మరింత బలంగా తయారు చేసేందుకు అమిత్ షా సునీల్ బన్సల్‌ను రంగంలోకి దించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.