BJYM : బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై బీజేవైఎం నేతలు ఆగ్రహం.. పది సీట్లు కేటాయించాలని లేదంటే రాజీనామా చేస్తామని హెచ్చరిక

బలం లేని జనసేనతో పొత్తు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. జనసేనకు కేటాయించిన సీట్లు తమకు ఇస్తే రాబోయే రోజుల్లో పార్టీకి నాయకత్వం పెరుగుతుందని చెబుతున్నారు.

BJYM angry with BJP

BJYM Angry With BJP : బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై బీజేవైఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పది సీట్లు కేటాయించాలని బీజేవైఎం కోరింది. కానీ, ఇప్పటివరకు ఇద్దరికి కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం సీటు కేటాయించలేదు. దీంతో రాజీనామా చేసే యోచనలో బీజేవైఎం రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు ఉన్నారు. ఏ క్షణమైనా నిర్ణయం తీసుకుంటామని బీజేవైఎం నేతలు హెచ్చరించారు.

జనసేనతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. బలం లేని జనసేనతో పొత్తు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. జనసేనకు కేటాయించిన సీట్లు తమకు ఇస్తే రాబోయే రోజుల్లో పార్టీకి నాయకత్వం పెరుగుతుందని చెబుతున్నారు. కనీసం యువ మోర్చాకు మూడు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు.

YS Sharmila : కేసీఆర్, కేటీఆర్ ను మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరు : వైఎస్ షర్మిల

ఇప్పటికే బీజేపీ రెండో జాబితాపై ఆ పార్టీ మహిళలు నేతలు అసంతృప్తితో ఉన్నారు. రెండు జాబితాలో మహిళలకు ఒక్క సీటు మాత్రమే కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బీజేవైఎం కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేవైఎం, మహిళా నేతలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో చూడాలి మరి.