YS Sharmila : కేసీఆర్, కేటీఆర్ ను మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరు : వైఎస్ షర్మిల

రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టి దివాలా తీయించారని విమర్శించారు. కోటి ఎకరాల మాగానికి సాగునీరని పనికి రాని ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్ల రూపాయలు కాజేసిన దోపిడీదారులు అన్నారు.

YS Sharmila : కేసీఆర్, కేటీఆర్ ను మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరు : వైఎస్ షర్మిల

YSRTP president YS Sharmila

Updated On : November 5, 2023 / 3:38 PM IST

YS Sharmila Sensational Comments : కేసీఆర్, కేటీఆర్ పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిపై చర్చించే దమ్ము, ధైర్యం లేక ఇంకా సెంటిమెంట్ ని వాడుకుంటున్నావా కేటీఆర్ అని ఎద్దేవా చేశారు. ‘మీ తండ్రీకొడుకులను మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు నమ్మి రెండు దఫాలు అధికారమిస్తే రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా తిన్న వెన్నుపోటుదారులని విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి, కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్న బందిపోట్లు మీరని ఆరోపించారు.

రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టి దివాలా తీయించారని విమర్శించారు. కోటి ఎకరాల మాగానికి సాగునీరని పనికి రాని ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్ల రూపాయలు కాజేసిన దోపిడీదారులు అన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి 10 ఏళ్లలో లక్ష ఉద్యోగాలు ఇవ్వలేని మీరు నిరుద్యోగుల పాలిట వ్యతిరేక శక్తులు అని విమర్శించారు. 3 ఎకరాల భూమి, ఇంటికి రూ.10 లక్షలు అని చెప్పి దళితులను దగా చేసిన దళిత ద్రోహులు అని ఆరోపించారు.

Congress : కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్ ల అందజేత.. మొదటి బీ ఫామ్ అందుకున్న రేవంత్ రెడ్డి

‘నిధులు, నీళ్లు, నియామకాల కోసం ప్రజలంతా ఏకమై సాగించిన ఉద్యమం సాక్షిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే.. నిధులు మీ ఖజానాకే, నీళ్లు మీ ఫామ్ హౌజ్ కే, నియామకాలు మీ ఇంట్లోకే. అని పేర్కొన్నారు. ఇంకా సెంటిమెంట్ రాజకీయాలు చేసి గద్దెనెక్కాలనుకోవడం మీ అవివేకానికి నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, నియంత పాలన చేస్తున్న తాలిబన్లను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు.