Congress : కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్ ల అందజేత.. మొదటి బీ ఫామ్ అందుకున్న రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ఇప్పటివరకు మొదటి, రెండో విడత జాబితాలను విడుదల చేసింది. దాదాపు వంద మంది అభ్యర్థులను ప్రకటించింది. వంద మంది అభ్యర్థులకు సంబంధించి బీ ఫామ్ లు ఇవ్వాలని నిర్ణయించింది.

Congress : కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్ ల అందజేత.. మొదటి బీ ఫామ్ అందుకున్న రేవంత్ రెడ్డి

Congress candidates B Forms

Updated On : November 5, 2023 / 3:17 PM IST

Congress Candidates B Forms : హైదరాబాద్ గాంధీబవన్ లో సందడి వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థులకు పార్టీ భీ పామ్స్ అందజేస్తోంది. మొదటి బీ ఫామ్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అందుకున్నారు. గాంధీ భవన్ సిబ్బంది రేవంత్ రెడ్డికి బీ ఫామ్ అందజేశారు. జగిత్యాల నుంచి బీ ఫామ్ ను జీవన్ రెడ్డి కుమారుడు అందుకున్నారు. కంటోన్మెంట్ నుంచి బీ ఫామ్ ను గద్దర్ కూతురు వెన్నెల అందుకున్నారు.

కాంగ్రెస్ ఇప్పటివరకు మొదటి, రెండో విడత జాబితాలను విడుదల చేసింది. దాదాపు వంద మంది అభ్యర్థులను ప్రకటించింది. వంద మంది అభ్యర్థులకు సంబంధించి బీ ఫామ్ లు ఇవ్వాలని నిర్ణయించింది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, నవంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న నేపథ్యంలో 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేసే గడువు ఉంది.

Congress – CPM : సీపీఎం నేతలతో బుజ్జగింపులు చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. తమ్మినేనికి ఫోన్ చేసి పోటీపై పునరాలోచన చేయాలని కోరిన భట్టి విక్రమార్క

కాబట్టి నామినేషన్లతోపాటు బీ ఫామ్ లు కూడా ముఖ్యం కావున బీ ఫామ్ ఉన్న వారిని మాత్రమే అభ్యర్థులుగా పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి బీ ఫామ్ కోసం వరుసగా నేతలందరినీ పిలుస్తున్నారు.
గాంధీ భవన్ సిబ్బంది మొట్ట మొదటి బీ ఫామ్ ను రేవంత్ రెడ్డికి ఇచ్చారు. రేవంత్ రెడ్డి అనుచరులు వచ్చి తీసుకెళ్లారు. రెండో బీ ఫామ్ ను కల్వకుర్తి నియోజకవర్గం బరిలో ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి తీసుకున్నారు.

మూడో బీ ఫామ్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతం నుంచి బోయి నగేష్ కు ఇచ్చారు. ముఖ్యమైన నేతలందరూ వారి వారి అనుచరులు, వారి పిల్లలు వచ్చి బీ ఫామ్ లు తీసుకుంటున్నారు. జగిత్యాలకు సంబంధించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. జీవన్ రెడ్డి తరపున ఆయన కుమారుడు బీ ఫామ్ తీసుకెళ్లారు. సికింద్రాబాద్ కంటో్న్మెంట్ బరిలో దిగిన గద్దర్ కూతురు వెన్నెల స్వయంగా వచ్చి బీ ఫామ్ ను తీసుకున్నారు.

Minister Mohammad Ali : హోంమంత్రి మహమూద్ అలీ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

ఎందుకంటే రేపటి నుంచి మంచి రోజులు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు నామినేషన్లు వేయాలనుకుంటున్నారు. రేపు కొడంగల్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. నవంబర్ 8న కామారెడ్డి నుంచి కూడా రేవంత్ నామినేషన్ వేయాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారు.