Hyderabad : హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్‌కు బాంబు కాల్.. భయంతో సిబ్బంది పరుగులు
Hyderabad : అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. భయంతో బయటకు పరుగులు తీశారు.

Hyderabad Income Tax Towers
Hyderabad – Income Tax Towers : హైదరాబాద్ లోని ఇన్ కమ్ ట్యాక్స్ టవర్స్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇన్ కమ్ ట్యాక్స్ టవర్స్ లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని దుండగుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. భయంతో బయటకు పరుగులు తీశారు.
దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బాంబు స్వ్కాడ్ సాయంతో ఇన్ కమ్ ట్యాక్స్ టవర్స్ ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇన్ కమ్ ట్యాక్స్ టవర్స్ లోని అణువణువు గాలించారు. చివరికి ఎలాంటి బాంబు లేదని పోలీసులు తేల్చారు. అది ఫేక్ కాల్ అని నిర్ధారించారు. దాంతో ఇన్ కమ్ ట్యాక్స్ టవర్స్ అధికారులు, సిబ్బంది అంతా ఊపిరిపీల్చుకున్నారు.
మాసబ్ ట్యాంక్ లోని ఇన్ కమ్ ట్యాక్స్ టవర్స్ లో బాంబు పెట్టినట్లు అగంతకుడు ఫోన్ చేసి చెప్పాడు. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇన్ కమ్ ట్యాక్స్ టవర్స్ లో పని చేసే అధికారులు, సిబ్బంది, పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు అంతా ఉలిక్కిపడ్డారు. భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు.
ఐటీ టవర్స్ సుమారు 15 ఫ్లోర్లు ఉంటుంది. ఏ ఫ్లోర్ లో బాంబు పెట్టారో అగంతకుడు చెప్పలేదు. రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్వ్కాడ్ సిబ్బంది సాయంతో టవర్స్ మొత్తాన్ని తనిఖీ చేశారు. చివరికి ఎలాంటి బాంబు లేదని తేల్చారు. అది ఫేక్ కాల్ అని నిర్ధారించారు. దాంతో ఐటీ టవర్స్ లో పని చేసే ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, ఇటీవలి కాలంలో ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. బాంబు పెట్టాము అంటూ ఫోన్ కాల్స్ రావడం పరిపాటిగా మారింది. అయితే, పోలీసుల తనిఖీల్లో అది ఫేక్ కాల్ అని తేలుతోంది.