Boyfriend shot
Boyfriend Shot Girlfriend Husband : మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ లో కాల్పులు కలకలం రేపాయి. శామీర్ పేటలోని సెలబ్రిటీ క్లబ్ లో ఓ వ్యక్తిపై యువకుడు కాల్పులు జరిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి శామీర్ పేట సెలబ్రిటీ క్లబ్ లోకి వచ్చారు. అయితే తన భార్య మరో వ్యక్తితో కలిసి వెళ్లారని తెలుసుకున్న ఆమె భర్త క్లబ్ కు వెళ్లాడు.
అక్కడ ఇద్దరు రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో వివాహేతర సంబంధంపై వారిని నిలదీశారు. వారి మధ్య మాటా మాటా పెరగడంతో ఆగ్రహించిన ప్రియుడు తన దగ్గర ఉన్న ఎయిర్ గన్ తో అతడిపై
కాల్పులు జరిపాడు. దీంతో అతనికి గాయాలు అయ్యాయి.
Siddipet: పెళ్లయి పిల్లలున్న మహిళతో యువకుడు వివాహేతర సంబంధం.. చివరికి ప్రాణాలు తీసింది..
ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు మోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే కాల్పులకు కారణమని పోలీసులు నిర్ధారించారు.