KCR Bus Yatra
KCR : లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టిసారించారు. ఈ క్రమంలో బస్సుయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ చేపట్టబోతున్న బస్సుయాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ మొదలై మే 10వ తేదీ వరకు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. 17రోజులుపాటు పన్నెండు నియోజకవర్గాల్లో సాగే బస్సు యాత్రకు బీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ మిర్యాలగూడలో ప్రారంభం కానున్న కేసీఆర్ బస్సు యాత్ర సిద్ధిపేటలో జరిగే బహిరంగ సభతో ముగుస్తుంది. కేసీఆర్ చేయనున్న యాత్ర కోసం రెడీ చేసిన బస్సుకు తెలంగాణ భవన్ లో మంగళవారం బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Also Read : Jagan Bus Yatra : శ్రీకాకుళం జిల్లాలో సీఏం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర.. షెడ్యూల్ ఇలా
కేసీఆర్ బస్సుయాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతుంది. తొలిరోజు నల్గొండ పార్లమెంట్ పరిధిలోని మిర్యాలగూడలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు సూర్యాపేట పట్టణంలో రోడ్ షో కొనసాగుతుంది. రాత్రి సూర్యాపేట లోని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయం లో కేసీఆర్ బస చేయనున్నారు.
Also Read : KTR Comments : చట్ట సభలకు పంపితే.. కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చీల్చాడు : కేటీఆర్