KCR Meeting With farmers : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు ఆదివారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించి సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. 10.30 గంటలకు జగనామ జిల్లా ధరావత్ తండాలో పర్యటించనున్న కేసీఆర్.. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు.
పర్యటన షెడ్యూల్ ఇలా..
మాజీ సీఎం కేసీఆర్ ఉదయం 10.30 గంటలకు జనాగమ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్ తండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు.
ఉదయం 11.30 గంటలకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట మండలాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకొని, అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు.
సాయంత్రం 3గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడతారు.
సాయంత్రం 4.30 గంటలకు నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని నిడమనూరుకు చేరుకుంటారు. అక్కడ పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు.
సాయంత్రం 6గంటలకు బయలుదేరి నల్గొండ మీదుగా రాత్రి 9గంటలకు ఎర్రవల్లి చేరుకుంటారు.