Yogi Adityanath (2)
Yogi Adityanath Comments BRS and Congress : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలసి ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ నేత, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు. తెలంగాణలోని ముస్లింలతో కలసి బలాన్ని పెంచుకొని ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోగా కేసీఆర్ మాత్రం భ్రష్టు పట్టిస్తున్నాడని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని, మాట్లాడారు.
ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు డబల్ ఇంజన్ సర్కారు ఉంది అంటే బీజేపీది బుల్లెట్ ప్రూఫ్ డబుల్ ఇంజన్ పని విధానమని తెలిపారు. మోదీ నేతృత్వంలో భారత దేశం తలెత్తుకొని తిరిగే విధంగా ఉందన్నారు. మన దేశం సురక్షంగా ఉందని ఇతర దేశాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. మన దేశంలో నయా భారత గరీబీ కోసం మోదీ ప్రభుత్వం పథకాలు ఇస్తుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వారి వ్యక్తిగత పనులు చేసుకుంటున్నారని ఆరోపించారు.
Also Read: పవన్ కళ్యాణ్ పీల్చే ప్రతీ శ్వాస చంద్రబాబుకి అధికారం కోసమే : పేర్ని నాని
2024లో మోదీ నేతృత్వంలో అయోధ్యలో హిందూత్వ పూజలు చేసుకుంటామని తెలిపారు. చెన్నమనేని విద్యాసాగర్ రావు వారసుడు డాక్టర్ వికాస్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. డిసెంబర్ 30న ఎన్నికల్లో వికాస్ రావును గెలిపిస్తే ప్రజలకు ఉచితంగా అయోధ్య రామమందిరం దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి సంస్కృతి, మానవత్వం మంచిగా ఉందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.