Perni Nani : పవన్ కళ్యాణ్ పీల్చే ప్రతీ శ్వాస చంద్రబాబుకి అధికారం కోసమే : పేర్ని నాని

పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి బాధితులకు ఇచ్చిన డబ్బుల కన్నా ఆయన వచ్చి వెళ్లిన చార్టెడ్ ఫ్లైట్ ఛార్జీలకే అధిక రేటు అయ్యిందన్నారు.

Perni Nani : పవన్ కళ్యాణ్ పీల్చే ప్రతీ శ్వాస చంద్రబాబుకి అధికారం కోసమే : పేర్ని నాని

Perni Nani

Updated On : November 25, 2023 / 5:10 PM IST

Perni Nani – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వావి వరసలు లేని రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పీల్చే ప్రతీ శ్వాస చంద్రబాబుకి అధికారం కోసమేనని విమర్శించారు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి బాధితులకు ఇచ్చిన డబ్బుల కన్నా ఆయన వచ్చి వెళ్లిన చార్టెడ్ ఫ్లైట్ ఛార్జీలకే అధిక రేటు అయ్యిందన్నారు.

వచ్చి బాధితులకు సహాయం అందించి వెళ్ళక ప్రభుత్వం, జగన్ పై విషం చిమ్మే అలవాటుతో అయిన కార్యక్రమం చేపట్టాడని విమర్శించారు. విశాఖ హార్బర్ కి రూ.16 వేల కోట్లు వస్తున్నాయని, వాటిని మత్స్యకారుల కోసం ఉపయోగించడం లేదంటూ విషం చిమ్ముతున్నాడని మండిపడ్డారు.

Nara Lokesh : ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకో జగన్.. అంటూ నారా లోకేశ్ సెటైర్లు

ఇంకా 4నెలలు ఆగితే తనది, చంద్రబాబు ప్రభుత్వం వస్తుందని పవన్ అంటున్నాడని తెలిపారు. 2014లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉంది మరి అప్పుడు ప్రజల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. టీడీపీ కి ఓటు వేసి గెలిపించండి ప్రశ్నించడానికి నేను ఉన్నానని చెప్పిన పవన్ మరి ఏనాడైనా ప్రశ్నించాడా అని నిలదీశారు.

ఒక్క ఫిషింగ్ హార్బర్ అయినా నిర్మించారా 960 కిలోమీటర్లు ఉన్న తీర ప్రాంతంలో ఒక్క హార్బర్ అయినా నిర్మించారా? కనీసం ఒక్క జెట్టి అయినా నిర్మించారా? కనీసం అనుమతులు అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కుప్పిగంతులు, వేషాలు చూసి ఊసరవెల్లి కూడా కంగారు పడిపోతుందని ఎద్దేవా చేశారు.

Vizag Harbour Case : విశాఖ మత్స్యకారుల కొంపముంచిన ఉప్పుచేప.. బోట్ల అగ్ని ప్రమాదం ఘటనలో కీలక మలుపు!

అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏ ఒక్క పని అయినా చేశారా అని నిలదీశారు. విశాఖపట్నం బోటు ప్రమాదాలపై 50 వేల రూపాయలు ఇచ్చి ఆయన ఇస్తే అయినా ప్రభుత్వం బాధితులకు సహాయం చేస్తుందనడం పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. ఇలాంటి పచ్చి దగాకోరు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ ఆర్చి తీర్చి నిద్రలేచి వచ్చేసరికి సీఎం జగన్ బాధితులకు పాక్షికంగా బోటు దెబ్బతిన్న అందరికీ 100% సహాయాన్ని అందిచారని తెలిపారు. రూ.7.11 లక్షలను బాధితులకు ప్రమాదం జరిగిన తరువాతి రోజే అందించారని పేర్కొన్నారు.