Nara Lokesh : ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకో జగన్.. అంటూ నారా లోకేశ్ సెటైర్లు

ఇక జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉండు..నీ పాత జైలు డ్రెస్ ను రెడీ చేసి పెట్టుకో అంటూ నారా లోకేశ్ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. నీ ఖైదీ డ్రెస్ 6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకో..అంటూ ఎద్దేవా చేశారు.

Nara Lokesh : ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకో జగన్.. అంటూ నారా లోకేశ్ సెటైర్లు

Nara Lokesh..YS Jagan

Nara Lokesh on YS Jagan : సీఎం జగన్‌పై నిరంతరం విమర్శలతో విరుచుకుపడే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి వినూత్నంగా సెటైర్లు వేశారు. ”దోచిన దొంగ సొమ్ముతో వ్యవస్థల్ని ఇంకెంతకాలం మేనేజ్ చేస్తావ్.. ఏ1 జగన్ అంటూ ప్రశ్నించారు. చట్టం, న్యాయం తన పని తాను చేయటం మొదలు పెట్టింది.. ఇక నువ్వు జైలుకు వెళ్లక తప్పదు.. నీ దొంగల ముఠా పని అయిపోయింది. ఇక జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉండు.. నీ పాత జైలు డ్రెస్ ను రెడీ చేసి పెట్టుకో” అని సెటైర్లతో విరుచుకుపడ్డారు. నీ ఖైదీ డ్రెస్ 6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకో అంటూ ట్విటర్ వేదికగా సెటైర్లు వేస్తు దీనికి సంబంధించి ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశారు.

కాగా, అక్రమాస్తుల కేసులో జగన్ కు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి సుప్రీంకోర్టు జగన్ తో పాటు సీబీఐకు నోటీసులు జారీ చేసింది. జగన్ కేసులు ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ తో పాటు బెయిల్ రద్దు పిటీషన్ ను జోడించి జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో భాగంగా జగన్, సీబీఐకి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.

Also Read : ఎంపీ రఘురామ పిటీషన్.. సీఎం జగన్, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. సాక్ష్యాలు చెరిపేస్తున్నారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సందర్భంగా.. కేసు పూర్వాపరాలు, జరిగిన ఘటనలపై వివరాలను రఘురామరాజు తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్‌ లిఖితపూర్వకంగా కోర్టుకు అందించారు. జగన్‌కు బెయిల్‌ మంజూరు చేసిన తర్వాత.. దర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో సుప్రీంకోర్టు సీఎం జగన్ తో పాటు సీబీఐకు కూడా నోటీసుల జారీ చేయటంతో.. ఇక జగన్ జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైందని, తన పాత జైలు డ్రెస్ రెడీ చేసి పెట్టుకోవాలంటూ ఎద్దేవా చేస్తూ ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు లోకేశ్.